News August 14, 2024
అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం

AP: అన్న క్యాంటీన్లకు నారా భువనేశ్వరి రూ.కోటి విరాళం ఇచ్చారు. ‘అన్నపూర్ణలాంటి ఆంధ్రప్రదేశ్లో ఆకలి అనే పదం వినబడకూడదనే మహోన్నత లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజే అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతుండటం శుభపరిణామం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు తరఫున రూ.కోటి ఇచ్చాను. నిరుపేదల ఆకలి తీర్చే కార్యక్రమంలో మీరూ భాగస్వాములు అవ్వండి’ అని ఆమె ట్వీట్ చేశారు.
Similar News
News January 16, 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.
News January 16, 2026
ESIC మెడికల్ కాలేజీ&హాస్పిటల్లో ఉద్యోగాలు

నోయిడాలోని<
News January 16, 2026
జస్టిస్ యశ్వంత్ వర్మకి సుప్రీంకోర్టులో చుక్కెదురు

తనపై పార్లమెంటరీ ప్యానెల్ దర్యాప్తును సవాల్ చేస్తూ జస్టిస్ యశ్వంత్ వర్మ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తుల విచారణ చట్టం 1965 ప్రకారం ఉమ్మడి కమిటీ తప్పనిసరి అనే ఆయన వాదనను తోసిపుచ్చింది. లోక్సభ స్పీకర్ ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తదుపరి చర్యలు చేపట్టడానికి అడ్డంకులను తొలగిస్తూ తీర్పు వెలువరించింది. 2025 మార్చిలో యశ్వంత్ నివాసంలో భారీ నోట్ల కట్టలు బయటపడిన సంగతి తెలిసిందే.


