News June 7, 2024
5 రోజుల్లో ₹579 కోట్లు సంపాదించిన నారా భువనేశ్వరి!
ఏపీలో చంద్రబాబు ఘన విజయంతో హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ షేర్లు గత 5 రోజుల్లో రికార్డు స్థాయిలో 55% పెరిగాయి. ఇవాళ కూడా 10% పెరిగి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. జూన్ 3న (ఎన్నికల ఫలితాలకు ముందు రోజు) రూ.424గా ఉన్న హెరిటేజ్ షేర్.. ఇవాళ రూ.661కి చేరింది. తద్వారా ఆ కంపెనీ ప్రమోటర్ భువనేశ్వరి సంపద 5 రోజుల్లో రూ.579 కోట్లు పెరిగినట్లు తెలుస్తోంది. హెరిటేజ్‌లో భువనేశ్వరి 24.37 శాతం వాటాను కలిగి ఉన్నారు.
Similar News
News December 27, 2024
చిల్డ్రన్స్ డేకి DEC 26 సరైన రోజు: కిషన్ రెడ్డి
TG: బాలల దినోత్సవాన్ని NOV 14న నిర్వహించడం సరి కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ధర్మం కోసం గురుగోవింద్ సింగ్ పిల్లలు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ ప్రాణత్యాగం చేసిన డిసెంబర్ 26న నిర్వహించాలన్నారు. ప్రధాని సూచనలతో DEC 26ను వీర్ బాల్ దివస్‌గా ప్రతి పాఠశాలలో నిర్వహించాలని కేంద్రం ఆదేశించినట్లు తెలిపారు. వీర్ బాల్ దివస్‌ను పాఠ్యాంశంగా చేర్చే అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తామన్నారు.
News December 27, 2024
MEMORIES: కరెన్సీ నోటుపై మన్మోహన్ సంతకం
ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో మన్మోహన్ సింగ్ ఒకరు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా పొందిన ఆయన.. 1982లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఆర్థికమంత్రిగా, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నారు. 1985 వరకు ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పని చేశారు. ఆ సమయంలో ఆయన కరెన్సీపై సంతకాలు చేసిన ఫొటోలను నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
News December 27, 2024
నేడు APలో సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి
AP: మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా నేడు ఏపీలో సెలవు ప్రకటించాలని నెటిజన్లు కోరుతున్నారు. ఇప్పటికే పక్క రాష్ట్రం తెలంగాణలో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఇచ్చారని, ఆయన సేవలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రంలోనూ హాలిడే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఆర్థికమంత్రిగా, ప్రధానిగా దేశానికి ఎంతో సేవ చేసిన మన్మోహన్‌కు నివాళి ఇవ్వాలని పోస్టులు చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?