News August 22, 2025

చిరంజీవికి నారా లోకేశ్, అల్లు అర్జున్ విషెస్

image

మెగాస్టార్ చిరంజీవికి సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టిన రోజు <<17480281>>శుభాకాంక్షలు<<>> వెల్లువెత్తుతున్నాయి. ‘సినిమా, సమాజానికి మీరు చేసిన అద్భుతమైన కృషి గర్వకారణం, స్ఫూర్తిదాయకం’ అని మంత్రి లోకేశ్, ‘వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. వీరితో పాటు తెలుగు రాష్ట్రాల మంత్రులు, సినీ హీరోలు, దర్శకులు విషెస్ తెలియజేస్తున్నారు.

Similar News

News August 22, 2025

బిహార్ ఓటరు జాబితాపై స్పందించిన సుప్రీంకోర్టు

image

బిహార్ ఓటరు జాబితా సవరణ వ్యవహారంపై రాజకీయ పార్టీల తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంపై పార్టీలు చొరవ చూపట్లేదని అభిప్రాయపడింది. అక్కడ 85వేల కొత్త ఓట్లు నమోదైతే రెండు అభ్యంతరాలు మాత్రమే వచ్చాయని తెలిపింది. ఓటు కోల్పోయిన ఓటర్లు ఫిర్యాదు చేయాలని సూచించింది. అటు ఓటర్ల ఆధార్‌ను గుర్తింపుగా అంగీకరించాలని ECని ఆదేశించింది. ఆధార్‌తో ఆన్‌లైన్లో ఓటు నమోదు చేసుకునేలా అవకాశం కల్పించాలని పేర్కొంది.

News August 22, 2025

అక్షయ్ కుమార్ హెల్త్ సీక్రెట్ ఇదే

image

బాలీవుడ్ స్టార్ నటుడు అక్షయ్ కుమార్ తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. రోజూ 6.30PMలోపు భోజనం చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ప్రతి సోమవారం ఉపవాసం ఉంటానని, ఆదివారం సాయంత్రం భోజనం చేసిన తర్వాత మళ్లీ మంగళవారం ఉదయం తింటానని వెల్లడించారు. అయితే సూర్యాస్తమయానికి ముందే భోజనం చేస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుందని, జీవక్రియ పెరుగుతుందని, రక్తంలో చక్కెర స్థాయులు సమతుల్యమవుతాయని వైద్యులు చెబుతున్నారు.

News August 22, 2025

ఈ-పాస్‌పోర్ట్‌ కోసం ఇలా అప్లై చేసుకోండి!

image

కేంద్రం దేశవ్యాప్తంగా ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేస్తోంది. దీని కోసం epassport <>సైట్‌లో<<>> అపాయింట్‌మెంట్ షెడ్యూల్ చేసుకుని, తర్వాత పాస్‌పోర్ట్ సేవా కేంద్రాల్లో వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. ట్రెడిషనల్ పాస్‌పోర్ట్‌కు ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. కానీ రీప్లేస్‌మెంట్ కాదు. దీని ఎంబెడెడ్ చిప్‌లో బయోమెట్రిక్ వివరాలుంటాయి. ఇది పాస్ పోర్టుకు భద్రతనివ్వడంతో పాటు విమానాశ్రయాల్లో ఇమ్మిగ్రేషన్‌ను ఈజీ చేస్తుంది.