News June 5, 2024
మళ్లీ ఐటీ మంత్రిగా నారా లోకేశ్!

AP: నారా లోకేశ్ మంత్రి పదవిపై చర్చ జరుగుతోంది. గత TDP ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్న ఆయన సమర్థంగా పని చేశారు. మంగళగిరి కేంద్రంగా IT అనుబంధ సంస్థల్ని ఏర్పాటు చేయించారు. స్కిల్ హబ్ సెంటర్ ద్వారా యువతకు అక్కడే శిక్షణ ఇప్పించారు. గన్నవరానికి HCL వంటి దిగ్గజ ఐటీ కంపెనీని తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. మరి ఈసారి అదే శాఖ తీసుకుంటారా? మరేదైనా కీలక శాఖ బాధ్యతలు చేపడతారా? అనేది ఆసక్తిగా మారింది.
Similar News
News January 27, 2026
డీసీసీబీల్లోనూ యూపీఐ సేవలు

AP: రాష్ట్రంలోని అన్ని డీసీసీబీల్లో త్వరలోనే UPI సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయోగాత్మకంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని సహకార బ్యాంకుల్లో నిన్న ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఈ బ్యాంకుల్లో ఎక్కువగా ఖాతాలు కలిగిన రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. ఇకపై ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్ల ద్వారా లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. కాగా ప్రస్తుతం వాణిజ్య బ్యాంకుల్లోనే ఈ సేవలు ఉన్న విషయం తెలిసిందే.
News January 27, 2026
మంత్రులతో భేటీకి కారణమిదే: భట్టి

TG: మున్సిపల్ ఎన్నికల్లో GPల కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని Dy.CM భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాభవన్లో భేటీలో మంత్రులు పరిపాలన, ఎన్నికలకు సంబంధించి మాట్లాడారని చెప్పారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో తనతో మాట్లాడి నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. సీఎం, మంత్రులందరం సమష్టిగా పనిచేస్తున్నామన్నారు. సింగరేణిలో అవినీతి జరగలేదని, ఏమైనా అనుమానాలు ఉంటే లేఖ రాస్తే విచారణ చేయిస్తామని తెలిపారు.
News January 27, 2026
మంచుదుప్పటి నడుమ గుడి ఎంత బ్యూటిఫుల్గా ఉందో!

అమెరికాలో భారీ హిమపాతం జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. మంచు భారీగా పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ డల్లాస్లోని కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మెరిసిపోతోంది. ఈ అద్భుత దృశ్యాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ మంచుతో ఉన్న ఆలయం ఫొటోలు ప్రస్తుతం SMలో వైరలవుతున్నాయి.


