News October 19, 2024
నారా లోకేశ్ ఆగ్రహం

AP: విశాఖ పర్యటనలో భాగంగా నెహ్రూ బజార్ ప్రాంతీయ గ్రంథాలయం ఆకస్మిక తనిఖీకి వెళ్లిన మంత్రి లోకేశ్ ఉ.9.45 గంటలకూ ఓపెన్ కాకపోవడంపై ఫైరయ్యారు. నిర్వహణ తీరుపై మండిపడ్డారు. గ్రంథాలయాల నిర్వహణ, పర్యవేక్షణ కోసం ఓ స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని నిర్ణయించారు. విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి దేశంలోనే బెస్ట్ మోడల్‌ను అధ్యయనం చేసి APలో అమలు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
Similar News
News January 16, 2026
అంత దెబ్బతిన్నా.. పాక్ ఎందుకు కవ్విస్తోంది?

ఆపరేషన్ సిందూర్ దెబ్బకు విలవిల్లాడిన పాక్ కొన్నిరోజులుగా సరిహద్దుల్లో తరచూ డ్రోన్లతో కవ్విస్తోంది. భారత రక్షణ వ్యవస్థలో ఎక్కడైనా లోపాలున్నాయా? మన సైన్యం ఎలా స్పందిస్తోంది? అనేవి తెలుసుకోవడమే వారి లక్ష్యమని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ముఖ్యంగా ఉగ్రవాదుల చొరబాటుకు ఏమైనా దారులున్నాయా అని పాక్ చెక్ చేస్తోందని వివరించారు. అయితే ఎక్కడ డ్రోన్ కనిపించినా మన సైన్యం తూటాలతో స్వాగతం పలుకుతోంది.
News January 16, 2026
బ్యారేజీని ప్రారంభించిన సీఎం రేవంత్

TG: గోదావరి నదిపై నిర్మల్ జిల్లాలో నిర్మించిన బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మామడ మం. పొన్కల్ గ్రామంలోని ఆ బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసి యాసంగికి నీరు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లాలోని చనాక-కొరాటా పంప్ హౌస్‌ను సీఎం ప్రారంభించారు.
News January 16, 2026
110 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

పుదుచ్చేరిలోని <


