News June 4, 2024

చరిత్ర సృష్టించిన నారా లోకేశ్

image

AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. టీడీపీ దశాబ్దాలుగా గెలవని మంగళగిరి సీటులో ఆ పార్టీ జెండాను ఎగరేసి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకూ ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ గెలిచింది రెండు సార్లే. 1985లో చివరిగా గెలిచింది. 2019లో ఓడినా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉండటం, సేవా కార్యక్రమాలు చేపట్టడం ఆయనపై ప్రజల్లో సానుకూలతను విపరీతంగా పెంచాయి.

Similar News

News November 28, 2025

VKB: నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ కండక్టర్

image

వికారాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో చేవెళ్ల-శంకర్‌పల్లి రూట్‌లో ఒక ప్రయాణికురాలు తన బ్యాగును మర్చిపోయింది. అందులో సుమారు రూ.2 లక్షల నగదు ఉంది. ఈ బ్యాగును గుర్తించిన కండక్టర్ మీనా, వెంటనే పోగొట్టుకున్న మహిళకు డబ్బును తిరిగి ఇచ్చారు. కండక్టర్ మీనా నిజాయితీని పలువురు ప్రశంసించారు.

News November 28, 2025

నేడే రాజధానిలో 15 బ్యాంకులకు శంకుస్థాపన

image

AP: రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు పడనుంది. దేశంలోని 15 ప్రముఖ బ్యాంకులు, బీమా సంస్థలు రాజధానిలో తమ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటున్నాయి. వీటికి ఈ ఉదయం 11.22గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, CM CBN చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. రూ.1,334 కోట్లతో నిర్మాణాలు చేపట్టనున్నారు. ఆయా బ్యాంకులు, బీమా సంస్థల ప్రతినిధులు, మంత్రులు, రాజధాని రైతులు హాజరుకానున్నారు.

News November 28, 2025

కయ్యానికి కాలు దువ్వుతున్న నేపాల్

image

భారత భూభాగాలను తమవిగా పేర్కొంటూ నేపాల్ కయ్యానికి కాలు దువ్వుతోంది. ఆ దేశం రూ.100 నోట్లను రిలీజ్ చేయగా, వాటిపై కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు తమవే అన్నట్లు మ్యాప్‌ను ముద్రించింది. 2020లో అప్పటి PM కేపీ శర్మ ఓలీ మ్యాప్‌ను సవరించగా, దాన్ని ఇప్పుడు నోట్లపై ప్రింట్ చేశారు. ఈ చర్యను ఖండించిన భారత్.. ఆ 3 ప్రాంతాలు IND అంతర్భాగాలని పేర్కొంది. నేపాల్ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని చెప్పింది.