News November 3, 2024

హైదరాబాద్ చేరుకున్న నారా లోకేశ్

image

AP: మంత్రి నారా లోకేశ్ అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. వారంపాటు ఆయన యూఎస్‌లో పర్యటించారు. పరిశ్రమల ఏర్పాటుపై అక్కడి కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. బ్లూ ప్రింట్‌తో వచ్చే కంపెనీలకు వెంటనే అనుమతులు ఇస్తామని ప్రకటించారు. పలు కంపెనీల ప్రతినిధులకు పెట్టుబడులపై నమ్మకం కలిగించారు. ఏపీని ఒకసారి సందర్శించాల్సిందిగా అక్కడి పారిశ్రామికవేత్తలను ఆయన కోరారు.

Similar News

News February 14, 2026

రేపే బడ్జెట్

image

AP: రేపు రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 10.30amకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ భేటీ అయి బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. 11.15amకు శాసనసభ, మండలి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీలో పయ్యావుల బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై అచ్చెన్న బడ్జెట్ ప్రవేశపెడతారు. మండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అనంతరం ఉభయసభలు వాయిదా పడతాయి.

News February 14, 2026

మోదీపై నమ్మకంతో కరీంనగర్‌లో గెలిపించారు: బండి సంజయ్

image

TG: మోదీపై నమ్మకంతో ప్రజలు కరీంనగర్‌లో బీజేపీని గెలిపించారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. హామీలిచ్చి నెరవేర్చని కాంగ్రెస్‌కు ఓటర్లు గుణపాఠం చెప్పారని అన్నారు. జీహెచ్ఎంసీని ఒవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి అన్నదమ్ముల ఆస్తుల మాదిరి పంచుకున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 3 కార్పొరేషన్లనూ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

News February 14, 2026

టెన్త్ పరీక్షలు రాయనున్న వైభవ్ సూర్యవంశీ

image

సంచలన ఆటతో U19 WC గెలుపులో <<19068083>>కీలక పాత్ర<<>> పోషించిన వైభవ్ సూర్యవంశీ ఇక పరీక్షలపై ఫోకస్ పెట్టనున్నారు. ఈ నెల 17 నుంచి జరిగే CBSE పదో తరగతి ఎగ్జామ్స్ రాయనున్నారు. ఈ మేరకు అతడికి అడ్మిట్ కార్డు అందజేసినట్లు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్(బిహార్) ప్రిన్సిపల్ నీల్ కిశోర్ సిన్హా తెలిపారు. పరీక్షా హాలులో సాధారణ విద్యార్థి మాదిరే వైభవ్‌నూ చూస్తామని స్పష్టం చేశారు.