News June 10, 2024

వైఎస్ జగన్‌కు నారా లోకేశ్ వార్నింగ్

image

AP: వైఎస్ జగన్ ఓడిపోయినా రక్తచరిత్ర రాస్తూనే ఉన్నాడని TDP నేత నారా లోకేశ్ మండిపడ్డారు. ‘కర్నూలు జిల్లా బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన TDP నేత గౌరీనాథ్‌ చౌదరిని దారుణంగా హత్య చేయించారు. ఫ్యాక్షన్ పాలన వద్దని జనం ఛీకొట్టినా, బాబాయ్‌ని చంపినట్లే జనాన్ని చంపుతూ ఉన్నాడు జగన్ రెడ్డి. హత్యారాజకీయాలు ఇకనైనా ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించారు. నిందితులను వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Similar News

News December 24, 2024

నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కేంద్ర మంత్రులతోనూ సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావిస్తారు. రేపు రాత్రి అమరావతికి తిరిగొస్తారు.

News December 24, 2024

రష్యా ఆయిల్ దిగుమతి తగ్గింది.. మిడిల్ ఈస్ట్ నుంచి పెరిగింది

image

మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి NOVలో భారత్ క్రూడాయిల్ కొనుగోళ్లు 9 నెలల గరిష్ఠానికి చేరాయి. గత నెల ప్రతి రోజూ 2.28M బ్యారెళ్ల ముడిచమురు దిగుమతి జరిగింది. OCTతో పోలిస్తే ఇది 10.8% ఎక్కువ. ఇది మొత్తం దేశీయ క్రూడాయిల్ దిగుమతుల్లో 48%. ఇదే సమయంలో రష్యా నుంచి దిగుమతి తగ్గడం గమనార్హం. OCTలో రోజూ 1.58 మిలియన్ బ్యారెళ్ల కొనుగోళ్లు జరగగా, NOVలో 13% తగ్గింది. మొత్తం దిగుమతుల్లో ఇది 32%.

News December 24, 2024

బాక్సింగ్ డే టెస్టుకు హెడ్ దూరం?

image

BGTలో భారత్‌కు తలనొప్పిగా మారిన ట్రావిస్ హెడ్ బాక్సింగ్ డే టెస్టుకు దూరం కానున్నట్లు సమాచారం. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను ఇంకా కోలుకోలేదని వార్తలు వస్తున్నాయి. ఆసీస్ ప్రాక్టీస్ సెషన్‌లోనూ హెడ్ కనిపించలేదని తెలుస్తోంది. ఇవాళ జరిగే ఫిట్‌నెస్ టెస్టు తర్వాత నాలుగో టెస్టులో ఆడేది లేనిది క్లారిటీ రానుంది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న హెడ్ 3 టెస్టుల్లో 2 సెంచరీలు చేసిన విషయం తెలిసిందే.