News June 23, 2024
రేపు నారా లోకేశ్ మంత్రిగా బాధ్యతలు

AP: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు ఐటీ, మానవ వనరులు, రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా సచివాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. నాలుగోబ్లాక్లో ఉన్న ఆయన ఛాంబర్లో కొన్ని మార్పుల పెండింగ్ కారణంగా పదవీ స్వీకారం ఆలస్యం అయినట్లు సమాచారం. తాజాగా అవి పూర్తి కావడంతో బాధ్యతల్ని స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం నుంచే ఆయన ఇప్పటి వరకు విధుల్ని నిర్వహిస్తున్నారు.
Similar News
News November 21, 2025
మహబూబాబాద్: నర్సింహులపేటలో విషాదం

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఫకీరాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని బొడ్డితండాకు చెందిన రైతు ఆంగోత్ భాను ఆకేరు వాగులో పడి మృతిచెందాడని స్థానికులు తెలిపారు. వ్యవసాయ భూములు ఆకేరు వాగు అవతల ఉండడంతో రైతు భాను బస్తాల టార్పాలిన్లను తీసుకొని వెళ్తున్న క్రమంలో కాలు జారీ వాగులోని కాలువ గుంతలో పడిపోయాడు. అతడిపై టార్పాలిన్లు పడడంతో ఊపిరాడక మృతిచెందాడు.
News November 21, 2025
కొత్త లేబర్ కోడ్లతో ప్రయోజనాలు..

✧ నేటి నుంచి <<18350734>>అమల్లోకి<<>> వచ్చిన లేబర్ కోడ్లతో 7వ తేదీలోపే వేతనం
✧ పురుషులతో సమానంగా మహిళలకు శాలరీ, రాత్రి పనిచేసే అవకాశం
✧ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్లకు గుర్తింపు.. PF, ESIC, ఇన్సూరెన్స్, OT చేసే కార్మికులకు డబుల్ పేమెంట్
✧ ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటీ
✧ 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత హెల్త్ చెకప్
✧ ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య భద్రత
News November 21, 2025
పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.


