News May 11, 2024
మంగళగిరి ప్రజలకు నారా లోకేశ్ లేఖ

AP: మంగళగిరిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్ది.. పేదరికం లేకుండా చేస్తానంటూ నారా లోకేశ్ ఆ నియోజకవర్గ ప్రజలకు లేఖ రాశారు. ‘2019లో స్వల్ప తేడాతోనే ఓడినా.. ఆ తర్వాతి రోజు నుంచే ఇక్కడి ప్రజలతో మమేకం అయ్యాను. ఐదేళ్లుగా ప్రజల కష్టసుఖాల్లో భాగమయ్యా. పాదయాత్రతో ఏడాది నియోజకవర్గానికి దూరంగా ఉన్నా నా మనసంతా మంగళగిరిలోనే ఉండేది. ఈ ఎన్నికల్లో మీ ఇంటిబిడ్డలా ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి పంపండి’ అని కోరారు.
Similar News
News November 21, 2025
జడేజాను వదులుకోవడంపై ఆశ్చర్యపోయా: కుంబ్లే

స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాను CSK వదులుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అన్నారు. ‘మామూలుగా CSK తమ ప్లేయర్లను వదులుకోదు. ముఖ్యంగా చాలా కాలంగా కొనసాగుతున్న జడేజా లాంటి వారిని అస్సలు వెళ్లనివ్వదు’ అని చెప్పారు. జడేజాను రాజస్థాన్, శాంసన్‌ను CSK తీసుకోవడం పెద్ద పరిణామం అని తెలిపారు. అయితే జడేజాకు RR మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ ఇస్తుందా అనేది పెద్ద ప్రశ్న అన్నారు.
News November 21, 2025
మూవీ అప్డేట్స్

* విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో మూవీ డిసెంబర్ 15న సెట్స్‌పైకి వెళ్లే అవకాశం. ‘మన శంకర వరప్రసాద్ గారు’లో తన కామియో షూటింగ్ పూర్తి కాగానే వెంకటేశ్ ఈ ప్రాజెక్టుకు షిఫ్ట్ అవుతారని టాక్.
* ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ మ్యాన్-3. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్.
* ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ప్రకటిస్తామని రాజాసాబ్ టీమ్ వెల్లడి.
News November 21, 2025
ఇవాళ్టి నుంచే ‘యాషెస్’ సమరం

ప్రతిష్ఠాత్మక యాషెస్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఇవాళ ఉ.7.50 గంటలకు పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ మొదలుకానుంది. క్రికెట్‌లో భారత్-పాక్ పోరు తర్వాత ఆ స్థాయిలో జరిగే ఏకైక సిరీస్ యాషెస్ మాత్రమే. 2010-11 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ ఒక్క సిరీస్ కూడా గెలవలేదు. అక్కడ జరిగిన గత 3 సిరీస్‌లలో 0-5, 0-4, 0-4 తేడాతో ఘోరంగా ఓడింది. ఓవరాల్‌గా యాషెస్‌లో ఆసీస్‌దే పైచేయి కావడం గమనార్హం.


