News October 10, 2024

హీరోయిన్‌తో ఈనెల 13న నారా రోహిత్ ఎంగేజ్‌మెంట్

image

టాలీవుడ్ హీరో నారా రోహిత్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఈనెల 13న హైదరాబాద్‌లో ఆయన ఎంగేజ్‌మెంట్ జరగనున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఇటీవల ఆయన నటించిన ప్రతినిధి-2లో హీరోయిన్‌‌గా కనిపించిన సిరి లేళ్లను రోహిత్ వివాహమాడనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Similar News

News February 7, 2026

వాలంటైన్స్ డే స్పెషల్.. బెస్ట్ బడ్జెట్ ట్రిప్ డెస్టినేషన్స్

image

వాలంటైన్స్ డే సందర్భంగా భాగస్వామితో కలిసి ప్రకృతి ఒడిలో సమయాన్ని గడపాలనుకుంటున్న వారికి తెలుగు రాష్ట్రాల్లోనే చల్లని హిల్ స్టేషన్లు ఉన్నాయి. రూ.10,000-రూ.12,000 బడ్జెట్‌లోనే 2-3 రోజుల ట్రిప్‌ను ప్లాన్ చేసుకోవచ్చు. TG ఊటీగా పిలవబడే ‘అనంతగిరి హిల్స్’ తక్కువ ధరలో అద్భుతమైన అనుభూతినిస్తుంది. APలోని ‘అరకు వ్యాలీ’, ‘లంబసింగి’, ‘హార్స్‌లీ హిల్స్’ ఫిబ్రవరిలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి.

News February 7, 2026

ఇంటర్వ్యూతో కడప GDCHలో ఉద్యోగాలు

image

AP: కడప జిల్లాలోని గవర్నమెంట్ డెంటల్ కాలేజీ& హాస్పిటల్(GDCH) 9 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. MDS అర్హత గలవారు ఎల్లుండి(FEB 9)ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పీజీ మెరిట్ స్కోరు ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 44ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.2000, BC, SC, STలకు రూ.1000. నెలకు జీతం రూ.74,750 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in

News February 7, 2026

మేకిన్ ఇండియాకు బలం.. ట్రేడ్ డీల్‌పై మోదీ

image

ఇండియా, US <<19072293>>ఒప్పందం<<>>పై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘2 దేశాల మధ్య బలమైన సంబంధాల కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు కృతజ్ఞతలు. ఈ ఫ్రేమ్‌వర్క్ రైతులు, MSMEs, స్టార్టప్‌లు, జాలర్లు, మరెందరికో కొత్త అవకాశాలను సృష్టించడం ద్వారా మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేస్తుంది. మహిళలు, యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుంది. ప్రజలను శక్తిమంతం చేసే ప్రపంచ భాగస్వామ్యాలను నిర్మించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని ట్వీట్ చేశారు.