News August 31, 2025

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న నారా రోహిత్

image

అక్టోబర్‌ లేదా నవంబర్‌లో తాను వివాహం చేసుకోనున్నట్లు టాలీవుడ్ హీరో నారా రోహిత్ తెలిపారు. ‘ప్రతినిధి 2’ హీరోయిన్ శిరీషను తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పారు. కాగా ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లోని నోవాటెల్‌లో వీరిద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. రోహిత్ నటించిన ‘సుందరకాండ’ మూవీ ఇటీవలే విడుదలైంది.

Similar News

News September 1, 2025

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి.. జగన్ దిగ్భ్రాంతి

image

AP: రాష్ట్రంలో గణేశ్ నిమజ్జనాల సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకోవడంపై మాజీ సీఎం, YCP అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప.గో జిల్లా నరసాపురం మండలం తూర్పు తాళ్లలో ట్రాక్టర్ కింద పడి నలుగురు యువకులు <<17576615>>మరణించడం<<>> కలచివేసిందన్నారు. అల్లూరి(D) పాడేరు చింతలవీధిలో ఇద్దరు భక్తులు మరణించడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

News September 1, 2025

ఈ రోజు నమాజ్ వేళలు(సెప్టెంబర్ 1, సోమవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.49 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.02 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.42 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.30 గంటలకు
✒ ఇష: రాత్రి 7.43 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 1, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.