News October 5, 2025

నారదుని భక్తి సూత్రాలు – 2

image

‘సా త్వస్మిన్ పరమప్రేమరూపా’ అనేది నారదుని భక్తి సూత్రాల్లో రెండవది. దీనర్థం.. ‘భక్తి అంటే ఆరాధన మాత్రమే కాదు. పరమాత్మపై అపారమైన ప్రేమ కలిగి ఉండడం. దాంతో పాటు అచంచలమైన విశ్వాసం ఉండడం. ఈ విశ్వాసమే ప్రేమకు పునాది. ఈ ప్రేమ, విశ్వాసం మనిషిని జ్ఞాన మార్గంలో నడిపి, మోక్షానికి దారి తీస్తాయి. మనస్సులో పరమాత్మను ప్రేమించి, మనోభావంతో శ్రమించేదే నిజమైన భక్తి. ఇది ముక్తికి తొలి మెట్టు’. <<-se>>#NBS<<>>

Similar News

News April 9, 2026

‘ఆంటీ’ అన్నారని కోర్టుకు.. రూ.1.8 లక్షల ఫైన్

image

ఆంటీ అని పిలిచారని లండన్‌లో భారత సంతతి మహిళ ఇల్డా ఎస్టెవ్స్‌(61) కోర్టుకెక్కి విజయం సాధించారు. ఆమె నేషనల్ హెల్త్ సర్వీస్(NHS)లో నర్సుగా పనిచేస్తున్నారు. తనను పేరుతో పిలవాలని ఎన్నిసార్లు చెప్పినా వినకుండా తోటి ఉద్యోగి ఆంటీ అంటూ వేధించారని, ఇది వయో, లింగ వివక్ష కిందకి వస్తుందని కేసు పెట్టారు. విచారించిన కోర్టు ఆమెకు నష్టపరిహారంగా ₹1.8 లక్షలు చెల్లించాలని NHSను ఆదేశించింది.

News April 9, 2026

పాక్ నమ్మదగిన మీడియేటర్ కాదు: ఇజ్రాయెల్

image

అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేశామని పాకిస్థాన్‌ చెప్పుకుంటోంది. అయితే మీడియేటర్‌గా ఆ దేశ విశ్వసనీయతపై భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ సందేహాలు వ్యక్తం చేశారు. పాక్ నమ్మదగిన మధ్యవర్తి కాదని చెప్పారు. వాషింగ్టన్ సొంత కారణాలతో వ్యూహాత్మకంగా పాక్‌ను ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చిందన్నారు. గతంలో హమాస్‌తో డీల్ కోసం ఖతర్, తుర్కియేను US ఎలా వాడుకుందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.

News April 9, 2026

10-15 నిమిషాల్లో తినేస్తున్నారా?

image

సాధారణంగా 10-15 నిమిషాల్లో భోజనం చేస్తే దాన్ని వేగంగా తినడంగా భావిస్తారు. అంటే ఆహారాన్ని సరిగా నమల్లేదని అర్థం. దీనివల్ల బరువు పెరుగుతారు. బ్లడ్ షుగర్ లెవల్ పెరిగి టైప్-2 డయాబెటిస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. శరీరానికి పోషకాలు సరిగా అందవు. 20-30 నిమిషాల పాటు తినాలని, ప్రతి ముద్దను 20-30 సార్లు నమలాలని వైద్యులు సూచిస్తున్నారు. తినే సమయంలో టీవీలు, మొబైల్స్ పక్కనపెట్టాలట.
Share It