News October 8, 2025
నారద భక్తి సూత్రాలు – 4

‘యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధోభవతి, అమృతో భవతి, తృప్తో భవతి’ నారద భక్తి సూత్రాల్లో ఇది నాలుగవది. దీనర్థం.. నిష్కల్మషమైన భక్తిని పొందిన మానవుడు సిద్ధుడు అవుతాడు. వారికి మృత్యు భయం ఉండదు. జీవితంలో మరేదీ అవసరం లేదన్నట్లు శాశ్వతమైన తృప్తిని పొందుతాడు. ఈ భక్తి లభించడం వల్ల సాధన పూర్తై, అన్ని కోరికలు తీరిన అనుభూతి కలుగుతుంది. అమరత్వం లభిస్తుంది. సమస్త సుఖాలకు మూలం, ముక్తికి మార్గం ఈ భక్తే. <<-se>>#NBS<<>>
Similar News
News October 8, 2025
నోబెల్.. ఆరేళ్లుగా ఎదురు చూపులే!

మెడిసిన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ రంగాల్లో గొప్ప ఆవిష్కరణలకు గానూ ఈ ఏడాది కూడా పలువురిని <<17948685>>నోబెల్ బహుమతులు<<>> వరించాయి. కానీ వారిలో ఒక్కరూ భారతీయులు, భారత సంతతి శాస్త్రవేత్తలు లేకపోవడం సగటు భారతీయుడిని నిరాశకు గురి చేస్తోంది. 2019లో చివరిసారి భారత మూలాలున్న అభిజిత్ బెనర్జీకి ఎకానమిక్స్‌లో నోబెల్ వచ్చింది. దేశంలో ఆవిష్కరణలకు కొదువ లేకున్నా నోబెల్ స్థాయికి అవి వెళ్లలేకపోతుండటం ఆలోచించాల్సిన విషయం.
News October 8, 2025
నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలోకి ‘వార్-2’

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా నేటి అర్ధరాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా ట్వీట్ చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైంది. ఇందులో హీరోయిన్‌గా కియారా అద్వానీ నటించిన సంగతి తెలిసిందే.
News October 8, 2025
కెమిస్ట్రీలో ముగ్గురికి నోబెల్ ప్రైజ్

కెమిస్ట్రీ విభాగంలో ముగ్గురిని ప్రఖ్యాత నోబెల్-2025 బహుమతి వరించింది. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్‌వర్క్స్ డెవలప్ చేసినందుకు గాను సుసుము కటీగవా(జపాన్), రిచర్డ్ రాబ్సన్(ఆస్ట్రేలియా), ఒమర్ ఎం.యాగీ(అమెరికా)ని రాయల్ స్వీడిష్ అకాడమీ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. ఇప్పటివరకు <<17929651>>మెడిసిన్<<>>, <<17939496>>ఫిజిక్స్<<>> విభాగాల్లో బహుమతులు ప్రకటించింది. ఇంకా లిటరేచర్, ఎకనామిక్ సైన్స్, పీస్ విభాగాల్లో ప్రైజ్‌లు ప్రకటించాల్సి ఉంది.