News October 12, 2025

నారద భక్తి సూత్రాలు – 6

image

‘యత్‌ జ్ఞాత్వా మత్తో భవతి, స్తబ్ధో భవతి, ఆత్మారామోభవతి’ అనే దివ్య వాక్యం భక్తి ఉన్నత స్థితిని వివరిస్తుంది. దేనిని తెలుసుకుంటే భక్తుడు నిశ్చలమైనవాడై ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడో అదే ‘భగవత్ ప్రేమ’. అది కల్గినవారికి లౌకిక విషయాలపై వ్యామోహం పోయి, మనసు స్థిరత్వం పొందుతుంది. భగవంతుడి జ్ఞానాన్ని పొందిన భక్తుడు, తన సంతోషం కోసం బాహ్య ప్రపంచంపై ఆధారపడకుండా, ఆత్మలోనే శాశ్వతమైన ఆనందాన్ని పొందుతాడు. <<-se>>#NBS<<>>

Similar News

News October 12, 2025

HSCC లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

హాస్పిటల్ సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్(HSCC)లిమిటెడ్‌లో 27 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఎంబీఏ, ఇంజినీరింగ్ డిగ్రీ, ఫార్మసీ డిగ్రీ, పీజీ డిప్లొమా, LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజినీరింగ్ పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: http://hsccltd.co.in/

News October 12, 2025

దీపావళి ఆఫర్లు ప్రకటించిన టాటా, హ్యుందాయ్

image

దీపావళి సందర్భంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. అక్టోబర్ 21 వరకు క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్‌ఛైంజ్ ఆఫర్లు, లాయల్టీ బోనస్‌లు ఉంటాయని టాటా మోటార్స్ తెలిపింది. టియాగోపై రూ.20-30వేలు, నెక్సాన్‌పై రూ.35వేలు, పంచ్‌పై రూ.25వేలు డిస్కౌంట్ ఇస్తున్నట్లు పేర్కొంది. అటు హ్యుందాయ్ కంపెనీ సైతం వివిధ కార్లపై ఆఫర్లు ప్రకటించింది. జీఎస్టీ తగ్గింపు, తాజా డిస్కౌంట్లతో కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి.

News October 12, 2025

ఆ ఒక్క తప్పు వల్ల ఇందిర బలయ్యారు: చిదంబరం

image

‘ఆపరేషన్ బ్లూస్టార్’(1984)లో జరిగిన తప్పు వల్ల మాజీ PM ఇందిర తన ప్రాణాలను మూల్యంగా చెల్లించుకున్నారని కాంగ్రెస్ నేత చిదంబరం వ్యాఖ్యానించారు. ‘మిలిటరీ ఆఫీసర్లను అగౌరవపరచాలని కాదు కానీ.. గోల్డెన్ టెంపుల్‌ను స్వాధీనం చేసుకునేందుకు అది సరైన మార్గం కాదు. ఆర్మీని దూరంగా ఉంచి టెంపుల్‌ను ఎలా అధీనంలోకి తెచ్చుకోవాలో మేం తర్వాత చూపించాం. Op Blue Star అనేది ఉమ్మడి నిర్ణయం. ఇందిరనే బ్లేమ్ చేయలేం’ అని అన్నారు.