News March 17, 2024

నరసరావుపేట: ఎన్నికలపై సమీక్ష సమావేశం

image

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఎన్నికల ప్రవర్తన నియమావళిని కఠినతరం చేయాలని  కలెక్టర్ లోతేటి శివశంకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు ఎన్నికల నివేదికల సమర్పణ సి.విజిల్, సువిదయాప్, తదితర అంశాలపై ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బందితో జాయింట్ కలెక్టర్‌‌తో కలిసి కలెక్టర్ సమీక్ష చేశారు.

Similar News

News October 31, 2024

గుంటూరులో ‘రన్ ఫర్ యూనిటీ’: ఎస్పీ

image

గుంటూరు జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ఉదయం 6:45 గంటలకు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ‘ఐక్యత పరుగు'(రన్ ఫర్ యూనిటీ) నిర్వహించనున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఈ ఐక్యత పరుగులో పాల్గొనవచ్చునని ఎస్పీ సూచించారు. ‘ప్రతి ఒక్కరూ సమానులే’ అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు.

News October 30, 2024

మంగళగిరి మహిళకు TTDలో కీలక పదవి

image

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలక మండలి 24 మంది సభ్యులతో ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో మంగళగిరికి చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, చేనేత కుటుంబానికి చెందిన తమ్మిశెట్టి జానకి దేవికి చోటు దక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించారు.

News October 30, 2024

పల్నాడు: TTD పాలకవర్గంలో జంగాకు చోటు

image

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గం ఛైర్మన్, మెంబర్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్‌గా బీఆర్ నాయుడును నియమించగా, ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి TTD సభ్యుడిగా మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. జంగా కృష్ణమూర్తి ఇటీవలే వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే.