News May 4, 2024

క్షత్రియుల సమరక్షేత్రం నరసాపురం

image

రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన లోక్‌సభ స్థానం ప.గో(D) నరసాపురం. 1991లో PV నరసింహారావు GOVT ప్రమాదంలో పడగా.. TDP MP భూపతిరాజు విజయకుమార్ రాజు ఐదుగురు MPలతో కలిసి మద్దతిచ్చి ప్రభుత్వాన్ని కాపాడి సంచలనం సృష్టించారు. ఇక్కడ 16 సార్లు ఎన్నికలు జరిగితే 14 సార్లు క్షత్రియ సామాజికవర్గం వారే గెలిచారు. ఈసారి ఇక్కడ BJP భూపతిరాజు శ్రీనివాస వర్మను బరిలోకి దింపింది. ఉమాబాలను YCP పోటీ చేయిస్తోంది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News January 22, 2026

అడిషనల్ కలెక్టర్ ఆస్తులు రూ.వందల కోట్లు

image

TG: గతనెలలో రూ.60వేల లంచం తీసుకుంటూ దొరికిన హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ACB ఇవాళ రైడ్స్ చేసింది. సోదాల్లో రూ.4.65Cr విలువైన విల్లా, ఒక ఫ్లాట్, 8 ఓపెన్ ప్లాట్లు, 14.5 ఎకరాల వ్యవసాయ భూమి పేపర్లను స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.వందల కోట్లలో ఉంటుందని అంచనా. రూ.30లక్షల నగదు, 297 గ్రా. బంగారం, రూ.44.04 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించింది. ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది.

News January 22, 2026

భారత్ ఘన విజయం

image

న్యూజిలాండ్‌తో జరుగుతున్న 5 టీ20ల సిరీస్‌లో టీమ్ ఇండియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో 48 రన్స్ తేడాతో అద్భుత విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో NZ తడబడింది. ఫిలిప్స్(78), చాప్‌మన్(39) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. IND బౌలర్లలో చక్రవర్తి, దూబె చెరో 2, అక్షర్, అర్ష్‌దీప్, హార్దిక్ తలో వికెట్ తీసుకున్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్(84), రింకూ సింగ్(44), సూర్యకుమార్(32) రాణించారు.

News January 22, 2026

చికిత్సకు డబ్బులు లేవని.. హృదయ విదారక ఘటన

image

TG: HYD కూకట్‌పల్లిలో హృదయ విదారక ఘటన జరిగింది. దివ్యాంగురాలైన కూతురు శ్రీజావలి(18) ట్రీట్‌మెంట్‌కు డబ్బులు లేవని తల్లిదండ్రులే గొంతునులిమి చంపేశారు. తర్వాత 2రోజులు శవాన్ని ఇంట్లోనే పెట్టుకున్నారు. ఇవాళ కొడుకు నితిల్‌తో కలిసి భార్యభర్తలు సతీశ్, ఆమని పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అది పనిచేయలేదని ముగ్గురూ చేతులు కోసుకున్నారు. బాధ భరించలేక నితిల్ తన ఫ్రెండ్‌కు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది.