News August 15, 2025
నారావారిపల్లెకు స్కోచ్ అవార్డు.. సీఎం అభినందనలు

AP: సీఎం చంద్రబాబు స్వగ్రామం తిరుపతి(D) నారావారిపల్లెకు పీఎం సూర్యఘర్ పథకం కింద స్కోచ్ అవార్డు లభించింది. పైలట్ ప్రాజెక్టుగా ఎ.రంగంపేట, కందులవారిపల్లి, చిన్నరామాపురం, నారావారిపల్లెలో తక్కువ టైంలో సోలార్ రూఫ్‌టాప్ పనులను పూర్తి చేశారు. దీంతో ‘స్వర్ణ నారావారిపల్లె’ కింద కేంద్రం గుర్తించింది. SEP 20న ఢిల్లీలో జిల్లా అధికారులు అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా అధికారులను CM చంద్రబాబు అభినందించారు.
Similar News
News August 15, 2025
‘సుదర్శన చక్ర మిషన్’ ప్రకటించిన ప్రధాని

ఇండిపెండెన్స్ డే సందర్భంగా భారత రక్షణ వ్యవస్థకు సంబంధించి ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. త్రివిధ దళాల ఆయుధ సంపత్తి పెంచడమే లక్ష్యంగా ‘సుదర్శన చక్ర మిషన్’ను ప్రకటించారు. దీని ద్వారా రానున్న పదేళ్లలో రక్షణ శాఖకు అత్యంత అధునాతన ఆయుధాలు అందిస్తామని చెప్పారు. తద్వారా ఆయన పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరికలు పంపారు.
News August 15, 2025
సెలవులు రద్దు.. రేపటి వరకు జాగ్రత్త

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 24 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ‘3 రోజులు కొన్ని జిల్లాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి. రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్‌లో మరింత అప్రమత్తంగా ఉండాలి. అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేయాలి’ అని మంత్రి ఆదేశించారు.
News August 15, 2025
‘PM వికసిత్ భారత్’ పథకాన్ని ప్రకటించిన మోదీ

ప్రధాని మోదీ కొత్త పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై ఫ్రీడమ్ స్పీచ్ సందర్భంగా ‘ప్రధానమంత్రి వికసిత్ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా యువత కోసం రూ.లక్ష కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు చెప్పారు. తొలిసారి ఉద్యోగం సాధించినవారికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహం అందించనున్నట్లు వెల్లడించారు. ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు కూడా కేంద్రం ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.