News April 8, 2025
అమరావతిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్

AP: గంజాయి, డ్రగ్స్ కట్టడి కోసం అమరావతి కేంద్రంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా గంజాయి లేదా డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల దర్యాప్తు అధికారం ఈ పీఎస్ పరిధిలో ఉంటుందని అందులో పేర్కొంది. స్టేషన్ హెడ్‌గా డీఎస్పీ స్థాయి అధికారి ఉండనున్నారు.
Similar News
News April 8, 2025
SA స్టార్ ప్లేయర్ క్లాసెన్‌కు షాక్

సౌతాఫ్రికా స్టార్ ఆటగాడు క్లాసెన్‌కు ఆ దేశ క్రికెట్ బోర్డు(CSA) షాకిచ్చింది. బోర్డ్ విడుదల చేసిన 18మంది ఆటగాళ్ల 2025-26 కాంట్రాక్ట్ లిస్ట్‌లో క్లాసెన్ పేరు లేదు. ఇది ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు ICC ఈవెంట్స్, కీలక సిరీస్‌ల్లో పాల్గొనేలా మిల్లర్, డసెన్‌కు హైబ్రిడ్ కాంట్రాక్ట్ కల్పించింది. కాగా SRH స్టార్ ప్లేయర్ క్లాసెన్‌పై IPL తర్వాత CSA తుది నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
News April 8, 2025
ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ: కేంద్రమంత్రి

ఏపీలో రూ.80 వేల కోట్లతో పెట్రోలియం రిఫైనరీ పరిశ్రమ రాబోతున్నట్లు కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఏపీ, గుజరాత్, ఒడిశా రాష్ట్రాలు పెట్రోలియం రంగంలో పెట్టుబడులు ఆకర్షించడంలో ముందున్నాయన్నారు. గతంలో 27 దేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునేవాళ్లమని, ఇప్పుడు ఆ సంఖ్య 40 దేశాలకు పెరిగిందని ఆయన పేర్కొన్నారు.
News April 8, 2025
శ్రీలీలతో డేటింగ్.. బాలీవుడ్ హీరో ఏమన్నారంటే?

కుర్ర హీరోయిన్ శ్రీలీలతో ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పందించారు. తనకు ఇండస్ట్రీలో గర్ల్ ఫ్రెండ్ లేదని చెప్పారు. తన గురించి వస్తున్న కథనాలపై స్పందించేందుకు చిత్ర పరిశ్రమలో బంధువులెవరూ లేరన్నారు. ప్రస్తుతం ఈ హీరో శ్రీలీలతో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారని ప్రచారం జరిగింది.