News November 14, 2024
హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్
TG: లగచర్ల ఘటనలో అరెస్టైన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. కేసులో తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన అందులో పేర్కొన్నారు. కాగా ఈ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన వికారాబాద్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. ప్రస్తుతం నరేందర్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నారు.
Similar News
News December 26, 2024
మస్కట్ బాధితురాలిని రాష్ట్రానికి రప్పించిన మంత్రి లోకేశ్
AP: మస్కట్లో చిక్కుకుపోయిన ఓ మహిళను మంత్రి నారా లోకేశ్ క్షేమంగా రాష్ట్రానికి రప్పించారు. కోనసీమ జిల్లా పోలెకుర్రు పంచాయతీ తూర్పుపేటకు చెందిన వాసంశెట్టి పద్మ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లారు. ఆమెకు అక్కడ యజమానుల నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ఆమె తన బాధను ఓ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇది చూసిన లోకేశ్ వెంటనే స్పందించి ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చేలా చర్యలు తీసుకున్నారు.
News December 26, 2024
Latest Data: ఓటింగ్లో మహిళలే ముందు
2024 సార్వత్రిక ఎన్నికల్లో 65.78% మంది అర్హత కలిగిన మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టు తాజా గణాంకాల ద్వారా వెల్లడైంది. పురుషులు 65.55% మంది పోలింగ్లో పాల్గొన్నారు. తద్వారా వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా ఓటింగ్లో పాల్గొన్నారు. 2019లో మొత్తంగా 61.40 కోట్ల మంది ఓటేస్తే, 2024లో 64.64 కోట్ల మంది ఓటేయడం గమనార్హం.
News December 26, 2024
సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్?
ట్యాక్స్ పేయర్స్కి ఊరట కలిగించేలా 2025 బడ్జెట్లో కేంద్రం నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 2020లో తెచ్చిన పన్ను విధానం కింద ₹3.5 లక్షల- ₹10.50 లక్షల ఆదాయానికి 5-20%, ఈ మొత్తానికి మించితే 30% పన్ను చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుతం దేశం అర్థిక సవాళ్లు ఎదుర్కొంటుండడం, పెరుగుతున్న జీవన వ్యయాల నేపథ్యంలో Tax Payersకి ఊరట కలిగించేలా Budgetలో నిర్ణయాలుంటాయని సమాచారం.