News November 13, 2024
నరేందర్ రెడ్డి, రైతులను వెంటనే విడుదల చేయాలి: KTR
TG: తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘నరేందర్ రెడ్డి అరెస్టు రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనం. సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును BRSకు ఆపాదించే కుట్ర జరుగుతోంది. అక్రమ కేసులు, అరెస్టులతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుంది. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.
Similar News
News November 14, 2024
గ్రూప్-3 నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: CS
TG: నవంబర్ 17, 18 తేదీల్లో జరిగే గ్రూప్-3 పరీక్షకు 1401 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసేందుకు హాజరుకానున్నారు. ఈ క్రమంలో పరీక్ష సజావుగా, సక్రమంగా నిర్వహించేలా చూడాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఇక పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నారు. జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు.
News November 14, 2024
బాలల దినోత్సవం: నవంబరు 14నే ఎందుకంటే..
దేశ తొలి PM నెహ్రూ పిల్లలతో సమయం గడపడాన్ని ఇష్టపడేవారు. స్వాతంత్ర్యోద్యమం కారణంగా తన సొంత బిడ్డ అయిన ఇందిరకూ దూరంగానే గడపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో PM అయిన తర్వాత క్రమం తప్పకుండా పిల్లల్ని కలుస్తూ వారి సమక్షంలో సంతోషాన్ని పొందేవారు. 1964లో ఆయన కన్నుమూసిన తర్వాతి నుంచి జవహర్లాల్ జయంతిని భారత ప్రభుత్వం బాలల దినోత్సవంగా జరుపుతోంది. అప్పటి వరకు అంతర్జాతీయ తేదీ అయిన నవంబరు 20న వేడుకలు జరిగేవి.
News November 14, 2024
STOCK MARKETS: రికవరీయా? పతనమా?
స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడవుతున్నాయి. సూచీల గమనం చూస్తుంటే రికవరీ బాట పడతాయో, మరింత పతనమవుతాయో తెలియడం లేదని ఇన్వెస్టర్లు వాపోతున్నారు. నిఫ్టీ 23,591 (+32), సెన్సెక్స్ 77,829 (+141) వద్ద చలిస్తున్నాయి. మీడియా, బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ రంగాల్లో కొనుగోళ్ల సందడి కనిపిస్తోంది. FMCG, ఆటో, O&G రంగాల్లో సెల్లింగ్ ప్రెజర్ ఉంది. శ్రీరామ్ ఫిన్, M&M, అల్ట్రాటెక్ సెమ్, BEL, ట్రెంట్ లాప్ లూజర్స్.