News November 19, 2024
నరేశ్ ‘బచ్చల మల్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్

అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చల మల్లి’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 20న రిలీజ్ కానున్నట్లు హీరో ట్వీట్ చేశారు. ‘ఇది మీ కథ. లేకపోతే మీకు తెలిసినోడి కథ’ అని జోడించారు. 1990 నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం. సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తుండగా, హాస్య మూవీస్ బ్యానర్పై రాజేశ్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. అమృతా అయ్యర్ హీరోయిన్.
Similar News
News September 19, 2025
TDPలో చేరనున్న ముగ్గురు YCP ఎమ్మెల్సీలు?

AP: వైసీపీ ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, మర్రి రాజశేఖర్ టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీకి, ఎమ్మెల్సీ పదవులకు వీరు ముగ్గురు రాజీనామా చేశారు. కాగా వీరి రాజీనామాలపై మండలి ఛైర్మన్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
News September 19, 2025
పవన్ హాన్స్ లిమిటెడ్లో 13 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పవన్ హాన్స్ లిమిటెడ్లో 13 పోస్టులకు ప్రకటన వెలువడింది. అసిస్టెంట్ మేనేజర్, సేఫ్టీ మేనేజర్ తదితర ఉద్యోగాలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. పోస్టును బట్టి B.Tech/B.E, M.A, MCA, డిగ్రీ పూర్తయిన వారు, CHPL/ATPL లైసెన్సు ఉన్నవారు అర్హులు. దరఖాస్తుకు చివరి తేదీ OCT 12. పూర్తి వివరాల కోసం <
News September 19, 2025
ఆ ఒక్క టెస్టుతో రెండు జబ్బులూ గుర్తించొచ్చు..

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే మామోగ్రామ్ టెస్టు ఆధారంగా మహిళల్లో గుండె జబ్బుల ముప్పును గుర్తించే ఏఐ పరికరాన్ని పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఆస్ట్రేలియాలో 49వేల మందికి పైగా మహిళల మామోగ్రామ్, మరణ రికార్డులను ఉపయోగించి దీనికి శిక్షణ ఇచ్చారని ‘హార్ట్’ వైద్య పత్రికలో ప్రచురించారు. ఈ టూల్తో రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బుల ప్రమాదాన్ని గుర్తించొచ్చని పరిశోధనలో పాల్గొన్న డాక్టర్ జెన్నిఫర్ తెలిపారు.