News April 15, 2025

పంజాబ్‌పై వికెట్ల‘కింగ్’గా ఆవిర్భవించిన నరైన్!

image

ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్‌లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.

Similar News

News September 18, 2025

లిక్కర్ స్కాం.. నిందితులకు రిమాండ్ పొడిగింపు

image

AP: లిక్కర్ స్కాం కేసులో జైలులో ఉన్న 8 మంది నిందితులకు ఈ నెల 26 వరకు కోర్టు రిమాండ్ పొడిగించింది. నేటితో వారికి రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ హాజరుపరిచింది. కాగా ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టవ్వగా, నలుగురు నిందితులు బెయిల్‌పై విడుదలయ్యారు.

News September 18, 2025

రాహుల్ ఆరోపణలు నిరాధారం: ఈసీ

image

పలు రాష్ట్రాల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాహుల్ చేసిన <<17748163>>ఆరోపణలు <<>>నిరాధారమని ఈసీ కొట్టిపారేసింది. ప్రజల ఓట్లు ఏ ఒక్కటి ఆన్‌లైన్ ద్వారా డిలీట్ చేయలేదని తెలిపింది. సంబంధిత వ్యక్తికి తెలియకుండా ఓట్లను తొలగించలేదని వెల్లడించింది. 2023లో అలంద్‌లో ఓట్లు డిలీట్ చేసేందుకు ప్రయత్నిస్తే FIR నమోదుచేశామని పేర్కొంది. అలంద్‌లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ గెలిచినట్లు తెలిపింది.

News September 18, 2025

లిక్కర్ స్కాం.. 20 చోట్ల ఈడీ తనిఖీలు

image

ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి దేశవ్యాప్తంగా 20 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలో బోగస్ పేమెంట్లకు సంబంధించి లావాదేవీలు చేసిన వారి సంబంధీకుల ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.