News March 23, 2025
నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
Similar News
News March 24, 2025
మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.
News March 24, 2025
విమానం లేటైనా, రద్దైనా టికెట్ డబ్బులు వాపస్..

విమాన ప్రయాణికుల ముఖ్యమైన <<15872009>>హక్కులు<<>> * షెడ్యూలుకు 2వారాల నుంచి 24hrs లోపు రద్దయితే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా డబ్బు పొందొచ్చు * అన్నీ సవ్యంగా ఉన్నా బోర్డింగ్‌ను నిరాకరిస్తే డబ్బు పొందొచ్చు * ఫ్లయిట్ 6hrs లేటైతే ప్రత్యామ్నాయ ఏర్పాటు లేదా పరిహారం, భోజనం పొందొచ్చు. 24hrs అయితే వసతి పొందొచ్చు. * లగేజ్ పోతే KGకి ₹3K, డ్యామేజ్ అయితే ₹1K వరకు పొందొచ్చు * ప్రమాదంలో చనిపోతే/గాయపడితే ₹20L పరిహారం వస్తుంది.
News March 24, 2025
శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు

AP: విశాఖ చినముషిడివాడలోని శారదా పీఠానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో ఉన్న 9 శాశ్వత కట్టడాలను వారంలోగా తొలగించాలని ఆదేశించింది. లేదంటే తామే చర్యలు తీసుకుంటామని, తొలగింపు ఖర్చును మఠం నుంచి వసూలు చేస్తామని స్పష్టం చేసింది.