News April 30, 2024
నరైన్ టీమ్ మీటింగ్స్‌కి రాడు: శ్రేయస్

కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ల ప్రదర్శనపై ఆ జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడారు. మ్యాచ్‌కు ముందు ఓపెనర్లతో చర్చిస్తారా? అనే ప్రశ్నకు శ్రేయస్ స్పందిస్తూ.. ‘లేదు. ఫిలిప్ సాల్ట్ మీటింగ్స్‌కు హాజరవుతారు. పూర్తిగా ఆటలో లీనమైపోతారు. కానీ, నరైన్ అలా కాదు. అతడు టీమ్ మీటింగ్స్‌కి రారు. రావొద్దనే నేనూ చెబుతా(నవ్వుతూ)’ అని చెప్పుకొచ్చారు. ఇద్దరు ఓపెనర్లు KKRకు మంచి ఓపెనింగ్ ఇస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News March 3, 2026
హార్ముజ్‌లోకి షిప్పులు వస్తే తగలబెట్టేస్తాం: ఇరాన్

హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. తమ అనుమతి లేకుండా ఏ ఓడ వచ్చినా తగలబెట్టేస్తామని IRGC హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో 20% ఈ మార్గం నుంచే వెళ్తుంది. వాస్తవానికి ఇరాన్ దాడుల భయంతో మార్చి 1 నుంచే ఈ మార్గం నుంచి షిప్పులు వెళ్లడం లేదు. మరోవైపు కువైట్‌లో ఉన్న పశ్చిమాసియాలోనే అతిపెద్ద అమెరికన్ మిలిటరీ బేస్‌పై ఇరాన్ మిస్సైళ్లతో దాడి చేసింది.
News March 3, 2026
3,979 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

యంత్ర ఇండియా లిమిటెడ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో 3,979 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ITI, టెన్త్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు సవరణ మార్చి 4 నుంచి 7 వరకు చేసుకోవచ్చు. మెరిట్, DV, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. టెన్త్ అభ్యర్థులకు నెలకు రూ.8200, ITI అభ్యర్థులకు రూ.9600 స్టైపెండ్ చెల్లిస్తారు. వెబ్‌సైట్: recruit-gov.com/
News March 3, 2026
ఉలవ పంటలో బూడిద తెగులు – నివారణ

అధిక తేమ, రాత్రి, పగలు ఉష్ణోగ్రతల్లో ఎక్కువ వ్యత్యాసం ఉన్నప్పుడు ఉలవ పంటలో బూడిద తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు లీటరు నీటికి కార్బండిజం 50% W.P 1గ్రామును కలిపి పిచికారీ చేయాలి. ఒకవేళ తెగులు తీవ్రత ఎక్కువగా ఉంటే ఇదే మందును ఇదే మోతాదులో 15 రోజుల వ్యవధిలో రెండోసారి కూడా పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.


