News May 12, 2024
నరైన్ చెత్త రికార్డు

టీ20ల్లో సునీల్ నరైన్ చెత్త రికార్డు నెలకొల్పారు. T20 మెన్స్ క్రికెట్లో అత్యధిక సార్లు(44) డకౌటైన ప్లేయర్‌గా నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో అలెక్స్ హేల్స్(43), రషీద్ ఖాన్(42), స్టిర్లింగ్(32), మ్యాక్స్‌వెల్(31) ఉన్నారు. మరోవైపు ఐపీఎల్లో నరైన్ డకౌట్‌గా వెనుదిరగడం ఇది 16వ సారి.
Similar News
News March 14, 2026
Vote Vibe సర్వే.. బెంగాల్ సీఎంగా మమతకే ఓటు!

త్వరలో WB అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో Vote Vibe సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తర్వాతి CMగా మమతా బెనర్జీ వైపు 42% మంది ఓటర్లు మొగ్గు చూపారు. BJP నేత సువేందు అధికారికి 19% మంది మద్దతు పలికారు. ప్రస్తుతం మమత ప్రభుత్వ పనితీరు అద్భుతమని 34%, చాలా దారుణమని 18% మంది పేర్కొన్నారు. TMC అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న BJP ఆరోపణలను 47% మంది నమ్మడం గమనార్హం.
News March 14, 2026
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. డాలర్ కాకుండా యువాన్!

అమెరికా డాలర్‌ను దెబ్బకొట్టేందుకు ఇరాన్ పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. US డాలర్ కాకుండా చైనీస్ యువాన్ కరెన్సీ చెల్లిస్తేనే ‘హార్ముజ్’ నుంచి నౌకలకు పర్మిషన్ ఇస్తామని ఇరాన్ ప్రతినిధి చెప్పినట్లు అల్-జజీరా తెలిపింది. కాగా ఎప్పటి నుంచో ఆయిల్ బిజినెస్ కేవలం అమెరికా డాలర్లలోనే జరుగుతోంది. దీనివల్ల డాలర్ సూపర్ పవర్‌ఫుల్‌గా మారి అమెరికా తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇప్పుడు దానికి గండి పడే ఛాన్సుంది.
News March 14, 2026
హాస్టళ్లలో కట్టెల పొయ్యిలపై వంట.. ఐటీ కారిడార్‌లో పొగ

TG: హైదరాబాద్‌లో కమర్షియల్ సిలిండర్ల కొరతతో చాలా వరకు హాస్టళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు చేస్తున్నారు. దీంతో ఐటీ కారిడార్‌లో బిల్డింగుల మధ్య నుంచి పొగ వ్యాపిస్తున్న ఫొటో వైరల్‌గా మారింది. ఇప్పటికే చాలా పీజీలు, హాస్టళ్లలో టిఫిన్లు ఆపేశారు. తక్కువ గ్యాస్ వినియోగంతో పూర్తయ్యే వంటలే చేస్తున్నారు.


