News March 19, 2024
చావు నుంచి త్రుటిలో తప్పించుకున్నా: సురభి

త్రుటిలో చావు నుంచి తప్పించుకున్నట్లు హీరోయిన్ సురభి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘నేను ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఫ్లైట్ కంట్రోల్ తప్పింది. అందరం సీట్లలో నుంచి కిందపడిపోయాం. నా గుండె జారిపోయినంత పనైంది. కానీ కొన్ని గంటల తర్వాత పైలట్ సురక్షితంగా ల్యాండ్ చేశారు. నాకైతే చావు అంచులదాక వెళ్లొచ్చినట్లు అనిపించింది’ అంటూ తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించారు.
Similar News
News April 11, 2025
హెల్త్ చెకప్‌కోసం ఆస్పత్రికి కేసీఆర్

TG: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. ఇది కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ మాత్రమేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని పార్టీ నాయకత్వం శ్రేణులకు తెలిపింది. ఈ నెల 27న వరంగల్‌లో వజ్రోత్సవ సభకు ఆయన సిద్ధంగా ఉన్నారని వివరించింది.
News April 11, 2025
పట్టుకున్న చేప ప్రాణం తీసింది!

చెన్నైలో చేపలు పడుతున్న ఓ వ్యక్తి, చేప వల్లే చనిపోయాడు. మణికందన్ అనే వ్యక్తి కీలావలంలోని చేపల చెరువులో రెండు చేపల్ని పట్టుకున్నారు. ఒకదాన్ని చేతితో, మరోదాన్ని నోటితో పట్టుకుని ఒడ్డుకు ఈదుకుంటూ వస్తుండగా నోటితో పట్టుకున్న చేప ఆయన గొంతులోకి వెళ్లిపోయింది. అక్కడే అది ఇరుక్కుపోవడంతో మణికందన్ విలవిల్లాడారు. స్థానికులు సాయం చేసేలోపే ప్రాణాలు విడిచారు.
News April 11, 2025
చైనా ప్రతిపాదన… ఆస్ట్రేలియా తిరస్కరణ

అమెరికాతో ట్రేడ్ వార్ నేపథ్యంలో వేరే దేశాలకు తమ ఉత్పత్తుల్ని ఎగుమతి చేయాలని చైనా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా ఆస్ట్రేలియాను తమకు కలిసిరావాలని కోరగా బీజింగ్‌కు చుక్కెదురైంది. అమెరికా సుంకాలపై ఉమ్మడిగా పోరాడదామంటూ చైనా ఇచ్చిన పిలుపును ఆస్ట్రేలియా తిరస్కరించింది. తమ దేశ ప్రయోజనాలే తమకు ముఖ్యమని, చైనా చేతిని పట్టుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. ఇతర దేశాలతో వాణిజ్యం చేస్తామని పేర్కొంది.