News May 25, 2024
నటాషా ఆసక్తికర పోస్ట్ హార్దిక్ కోసమేనా?

క్రికెటర్ హార్దిక్ పాండ్యతో విడాకుల <<13306818>>వార్తల<<>> నేపథ్యంలో ఆయన సతీమణి, నటి నటాషా ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ‘ఒకరు వీధిన పడబోతున్నారు’ అనే క్యాప్షన్తో ట్రాఫిక్ సిగ్నల్స్ ఫొటో షేర్ చేశారు. అయితే.. ఇది పాండ్యను ఉద్దేశించిందేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Similar News
News October 3, 2025
‘ఐ లవ్ మోదీ’ అనొచ్చు.. ‘ఐ లవ్ మహమ్మద్’ అనకూడదా: ఒవైసీ

యూపీలోని బరేలీలో ‘<<17838405>>ఐ లవ్ మహమ్మద్<<>>’ అంశంపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ధ్వజమెత్తారు. దేశంలో ‘ఐ లవ్ మోదీ’ అంటే ఎలాంటి సమస్య ఉండదని, ‘ఐ లవ్ మహమ్మద్’ అంటే అభ్యంతరమా? అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలతో దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారని నిలదీశారు. తాను మహమ్మద్ వల్లే ముస్లింగా ఉన్నానని పేర్కొన్నారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు నివసిస్తున్నారని తెలిపారు.
News October 3, 2025
తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్!

AP: తిరుపతిలో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. పలుచోట్ల RDX బాంబులు పెట్టినట్లు దుండగులు మెయిల్స్ పంపారు. “హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్స్” పేరిట వచ్చిన వీటిపై అధికారులు అలర్టయ్యారు. తిరుపతి, శ్రీకాళహస్తి, అలిపిరి, తిరుచానూరులో భద్రతా విభాగాలు సోదాలు చేపట్టాయి. 2024 అక్టోబర్లో కూడా ఇవే రకమైన మెయిల్స్ రాగా అధికారుల తనిఖీల్లో బూటకపు బెదిరింపుగా తేలింది.
News October 3, 2025
బియ్యం పురుగుపట్టకుండా ఉండాలంటే?

* ఉల్లిపాయ ముక్కలు వేయించేటప్పుడు అందులో కొంచెం పాలు కలిపితే ముక్కలు నల్లబడవు.
* ఇడ్లీ, దోశల పిండిలో రెండు తమలపాకులు వేసి ఉంచితే తాజాగా ఉంటుంది.
* బియ్యం పోసుకునే బాక్సులో నాలుగు ఎండు మిరపకాయలను ఉంచితే పురుగు పట్టదు.
* కోడిగుడ్లను ఉడకబెట్టే నీటిలో ఒక స్పూన్ వెనిగర్ కలిపితే గుడ్డు పగిలినా అందులోని పదార్థం బయటకు రాదు.
<<-se>>#VantintiChitkalu<<>>