News August 30, 2024
మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: మోదీ

పారిస్ పారాలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన అవని లేఖరా, బ్రాంజ్ గెలిచిన మోనా అగర్వాల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. 3 పారాలింపిక్ పతకాలను గెలుచుకున్న తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా అవని చరిత్ర సృష్టించారని, తన అంకితభావంతో దేశం గర్వపడేలా చేస్తున్నారని కొనియాడారు. కాంస్య పతకాన్ని గెలిచిన మోనాను చూసి భారతదేశం గర్విస్తోందని ట్వీట్ చేశారు.
Similar News
News November 26, 2025
GNT: ఈ పరిస్థితి మీ ప్రాంతంలో కూడా ఉందా.?

ఏపీలో స్థానిక సంస్థలు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా పలువురు నాయకులు సేఫ్ జోన్ వెతుక్కుంటున్నారు. ఇతర పార్టీలకు చెందినవారు అధికార పార్టీ వైపు క్యూ కడుతున్నారు. గతంలో వ్యతిరేకంగా పనిచేసినవారె, ఇప్పుడు కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు స్థానికంగా ప్రచారం సాగటంతో, మళ్లీ వారికే ప్రాముఖ్యత వస్తె తమ పరిస్థితి ఏమిటని? కూటమి వాపోతున్నారు. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
News November 26, 2025
నా భవిష్యత్తుపై బీసీసీఐదే నిర్ణయం: గంభీర్

సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం IND హెడ్ కోచ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై BCCI నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘నేను పదవిలో కొనసాగడానికి అర్హత ఉందా లేదా అనేది బోర్డు డిసైడ్ చేస్తుంది. భారత క్రికెట్ మాత్రమే ముఖ్యం. నేను కాదు’ అని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ గెలిచినప్పుడూ తానే కోచ్‌గా ఉన్నానని గుర్తు చేశారు. తాజా ఓటమికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలన్నారు.
News November 26, 2025
HOCLలో 72 పోస్టులు.. అప్లై చేశారా?

కేరళలోని హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్ లిమిటెడ్(<


