News June 13, 2024

జమ్మూకశ్మీర్‌లో జాతీయ గీతాలాపన తప్పనిసరి: విద్యాశాఖ

image

జమ్మూకశ్మీర్‌లోని అన్ని పాఠశాలల్లోనూ రోజూ ఉదయం అసెంబ్లీ సమయంలో కచ్చితంగా జాతీయగీతాన్ని ఆలపించాలని అక్కడి విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీ చేశారు. ఉదయం అసెంబ్లీల ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక సమగ్రత, ఐకమత్యం అలవడతాయని అందులో వివరించారు. అవసరమైతే ప్రత్యేక అతిథుల్ని ఆహ్వానించి విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంచాలని సూచించారు.

Similar News

News October 7, 2024

బీజేపీలో చేరిన పద్మశ్రీ గ్రహీత

image

పద్మశ్రీ అవార్డు గ్రహీత, గిరిజన కళాకారిణి దుర్గాభాయ్ బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ విధానాలకు ఆకర్షితురాలై ఆమె కాషాయ పార్టీలో చేరినట్లు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తెలిపారు. స్వయంగా దుర్గాభాయ్ ఇంటికి వెళ్లిన సీఎం ఆమెకు బీజేపీ సభ్యత్వం ఇచ్చారు. కాగా దుర్గాభాయ్ 2022లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు.

News October 7, 2024

నిమ్మ రోజూ తినడం వల్ల ఉపయోగాలివే

image

నిమ్మకాయను ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ‘వాటిలో పుష్కలంగా ఉండే విటమిన్-సి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. దీంతో ఎక్కువ కాలరీలు ఖర్చై బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. నిమ్మలోని పీచు పదార్థం వలన పొట్ట నిండుగా అనిపించి జంక్ ఫుడ్ లేదా ఆయిల్ ఫుడ్ తినాలన్న కోరిక తగ్గుతుంది. అరుగుదల మెరుగుపరుస్తుంది. అనారోగ్యాలు దరిచేరవు’ అని వివరిస్తున్నారు.

News October 7, 2024

వచ్చే ఏడాది మూడు చోట్ల బీచ్ ఫెస్టివల్: మంత్రి దుర్గేశ్

image

AP: రుషికొండ నిర్మాణాలను ఎలా హ్యండిల్ చేయాలో అర్థం కావడం లేదని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. అవినీతి సామ్రాజ్యానికి సూచికగా రుషికొండలో మ్యూజియం ఏర్పాటు చేయాలేమోనని సెటైర్లు వేశారు. కొత్త టూరిజం పాలసీ రూపకల్పన జరుగుతోందన్నారు. దీనిలో భాగంగా స్వదేశీ దర్శన్, ప్రసాద్ స్కీం రాష్ట్రంలో అమలు చేస్తామన్నారు. వచ్చే ఏడాది విశాఖ, కాకినాడ, బాపట్లలో బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు.