News February 20, 2025

నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు

image

TG: రంగారెడ్డి జిల్లా కన్హాశాంతివనంలో నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్ర పర్యావరణ మంత్రి కొండా సురేఖ సదస్సును ప్రారంభిస్తారు. 3రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు హాజరుకానున్నారు. సదస్సు ముగింపు రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Similar News

News January 10, 2026

కాలుష్యంలో ఢిల్లీని దాటేసిన బర్నీహాట్

image

దేశంలో కాలుష్యానికి రాజధాని ఢిల్లీనే అనుకుంటే ఈసారి అస్సాంలోని బర్నీహాట్ పట్టణం అంతకు మించిపోయింది. ఢిల్లీని వెనక్కి నెట్టి దేశంలోనే అత్యంత కలుషిత పట్టణంగా నిలిచింది. సీఆర్ఈఏ (Centre for Research on Energy and Clean Air) తాజా నివేదిక ప్రకారం పీఎం2.5, పీఎం10 స్థాయులు ఆందోళనకరంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా 44% నగరాలు వాయు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. UPలో అత్యధికంగా 416 నగరాలు ఈ జాబితాలో నిలిచాయి.

News January 10, 2026

బొంత ఊద.. వరి లాంటి కలుపు మొక్క

image

వరి చేనులో బొంత ఊద కలుపు మొక్కలు కలవరపెడుతున్నాయి. ఇవి కూడా వరి మాదిరిగానే పెరుగుతాయి. పూర్తిగా పెరిగే వరకు వీటిని గుర్తుపట్టలేము. అందుకే దీన్ని దొంగ వరి అంటారు. పంటకు అందించే పోషకాలను ఇవి గ్రహించి వరి కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతాయి. ఈ కలుపు మొక్కల వల్ల వరిలో పొడ తెగులు, సుడిదోమ ఉద్ధృతి పెరుగుతుందని రైతులు అంటున్నారు. వరిలో ఇలాంటి కలుపును గుర్తిస్తే నిపుణుల సూచనల మేరకు మందులు వాడి నిర్మూలించండి.

News January 10, 2026

హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీలో ఇంటర్న్‌షిప్

image

<>DRDO<<>>కు చెందిన హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ లాబోరేటరీ 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. BE/BTech 7, 8వ సెమిస్టర్, MTech ఫస్ట్ ఇయర్/ సెకండ్ ఇయర్ చదువుతున్న వారు జనవరి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in