News October 1, 2024
‘నేషనల్ క్రష్’ తాత్కాలిక దశ మాత్రమే: మను భాకర్

తనను నేషనల్ క్రష్ అని పిలుస్తుండటాన్ని ఒలింపిక్ షూటర్ మను భాకర్ కొట్టిపారేశారు. ఇది కేవలం ఒక దశ మాత్రమేనని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ప్రతి రెండు నెలలకు ఆ బిరుదు మారుతుంటుంది. ఎప్పటికప్పుడు కొత్త నేషనల్ క్రష్ వస్తుంటారు. ఇది కేవలం ఓ దశ మాత్రమే. మెడల్ గెలిచాక కూడా నా జీవితం ఒకప్పటిలాగే ఉంటుంది. అయితే ప్రజలకు తెలిశాను కాబట్టి మరిన్ని మెడల్స్ ఆశిస్తారు’ అని వివరించారు.
Similar News
News November 28, 2025
HYD: మంచినీరు వృథా చేస్తే.. కాల్ చేయండి!

HYDలో జలమండలి సరఫరా చేసే మంచినీటిని కార్లు, బైకులు కడగటానికి, రోడ్లు కడగటానికి ఉపయోగించడం, మోటార్లు పెట్టి నిర్మిస్తున్న ఇళ్లకు క్యూరింగ్ చేయడం లాంటివి చేస్తే కఠినంగా వ్యవహరించి భారీ జరిమానా వేస్తామని జలమండలి హెచ్చరించింది. ఎవరైనా చూస్తే వెంటనే ఫొటో తీసి, 155313, HMWSSB యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించింది. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొంది.
News November 28, 2025
‘థర్డ్ వరల్డ్’ దేశాల లిస్ట్‌లో భారత్ ఉందా?

థర్డ్ వరల్డ్ దేశాల నుంచి వలసలను నిలిపివేస్తామని ట్రంప్<<18410545>> ప్రకటించిన<<>> విషయం తెలిసిందే. ‘థర్డ్ వరల్డ్’ పదం ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పాపులర్ అయింది. అప్పట్లో అమెరికా-నాటో దేశాలు ఫస్ట్ వరల్డ్, సోవియట్ యూనియన్ అనుబంధ దేశాలు సెకండ్ వరల్డ్‌గా, ఏ పక్షానికీ చేరని ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి పేద దేశాలను ‘థర్డ్ వరల్డ్’ అని పిలిచేవారు. UN LDCs లిస్ట్ ప్రకారం ఇందులో 44 దేశాలు ఉన్నాయి. వీటిలో భారత్ లేదు.
News November 28, 2025
మేనరిక వివాహాలు చేసుకుంటున్నారా?

మేనరికపు వివాహాలు చేసుకోవడం మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ఇప్పటికీ చాలా చోట్ల జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పటికే వివాహం అయితే జెనెటిక్ కౌన్సెలింగ్‌కి వెళ్లాలి. జెనెటిక్, క్రోమోజోమ్స్ కారణాలతో గర్భస్రావం అవుతుంటే కార్యోటైప్ టెస్ట్, అబార్షన్ అయితే పిండానిదీ, తల్లిదండ్రులదీ జెనెటిక్ మేకప్ చేయించుకోవాలి. థైరాయిడ్, డయాబెటిస్, ఎనీమియా వంటివి కూడా ముందే చెక్ చేయించుకోవాలి.


