News April 15, 2025

నేషనల్ హెరాల్డ్ కేసు: ఛార్జి‌షీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

image

నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు శామ్ పిట్రోడా, సుమన్ దూబె, ఇతర నేతల పేర్లను పేర్కొంది. దీనిపై ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 25న వాదనలను విననుంది. ఇప్పటికే ఈ కేసులో నేషనల్ హెరాల్డ్ ఆస్తుల జప్తునకు నోటీసులు ఇచ్చింది.

Similar News

News January 28, 2026

చంద్రబాబు అరకు పర్యటన రద్దు

image

AP: సీఎం చంద్రబాబు రేపటి అరకు పర్యటన రద్దైంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గురువారం ఆయన బారామతి వెళ్లనున్నారు. దీంతో రేపటి పర్యటనను రద్దు చేసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సీఎం‌తో పాటు మంత్రి లోకేశ్‌ కూడా అజిత్ పవార్ అంత్యక్రియలకు హాజరుకానున్నారు.

News January 28, 2026

టేబుల్‌టాప్ రన్‌వేలు ఎందుకు డేంజరస్?

image

* పీఠభూమి/కొండపై రన్‌వేతో 2 వైపులా లోయలు ఉండటం.
* రన్‌వే హారిజాంటల్‌గా, తక్కువ దూరం ఉన్నట్టు కనిపించడం.
* బ్రేకింగ్, గో అరౌండ్‌కు రన్‌వే పొడవు తక్కువగా ఉండటం.
* ఎత్తైన ప్రదేశంలో ఉండటంతో అకాల వర్షం, టైల్‌విండ్, తక్కువ విజిబిలిటీతో ల్యాండింగ్‌.
* పైలట్లు తప్పుగా అంచనా వేసి ఓవర్‌షూట్/అండర్‌షూట్ చేసే ఛాన్స్.
* ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టం వంటి అడ్వాన్స్‌డ్ ల్యాండింగ్ సపోర్ట్ లేకపోవడం.

News January 28, 2026

న్యూజిలాండ్ భారీ స్కోర్

image

విశాఖలో భారత్‌తో జరుగుతున్న 4వ టీ20లో న్యూజిలాండ్ టీమ్ 7 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. ఓపెనర్లు సీఫర్ట్(62), కాన్వే(44) విజృంభించారు. ఫిలిప్స్ 24 పరుగులతో రాణించారు. చివర్లో మిచెల్(39*) వేగంగా పరుగులు రాబట్టారు. అర్ష్‌దీప్, కుల్దీప్ చెరో 2, రవి బిష్ణోయ్, బుమ్రా తలో వికెట్ తీశారు. రింకూ 4 క్యాచ్‌లు అందుకున్నారు. IND గెలవాలంటే 216 పరుగులు చేయాలి.