News March 18, 2024
జాతీయ లోక్ అదాలత్.. 1760 కేసుల పరిష్కారం

ఉమ్మడి ప.గో జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ కు 32 బెంచీలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.పురుషోత్తం కుమార్ తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ నందు 1,971 కేసులను రాజీ చేశామన్నారు. అందులో 1,760 పెండింగ్ కేసులకు పరిష్కారం చూపామని చెప్పారు. వీటితో పాటు జిల్లా వ్యాప్తంగా 2,356 పెట్టీ కేసులను కూడా రాజీ చేశామన్నారు.
Similar News
News January 23, 2026
భీమవరం: ఇసుక కొరత ఏర్పడకూడదు.. కలెక్టర్ ఆదేశం

పెదఅమిరం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శుక్రవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కమిటీ సభ్యులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని జిల్లాలో ఇసుక కొరత ఏర్పడకుండా అవసరమైన స్టాకును ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. 1,32,954 మెట్రిక్ టన్నుల ఇసుక సిద్ధంగా ఉందన్నారు.
News January 23, 2026
భీమవరం: అన్న క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్

భీమవరం పాత బస్టాండ్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరిసరాలను పరిశీలించారు. ఉదయం అల్పాహారం స్వీకరిస్తున్న వారితో కొంతసేపు మాట్లాడి, అన్న క్యాంటీన్లో వడ్డిస్తున్న ఆహార పదార్థాలు నాణ్యత, రుచి, తాగునీరు, పరిసరాల పరిశుభ్రత అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఎక్కువమంది ఆహార పదార్థాలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
News January 23, 2026
నరసాపురం: ‘తాబేళ్ల సంరక్షణకు చర్యలు’

తీర ప్రాంత గ్రామాల్లో సముద్ర పర్యావరణ పరిరక్షణకు దోహదపడే తాబేళ్లను సంరక్షించేందుకు, వాటి సంతతిని పెంచేందుకు అటవీ శాఖా పరంగా చర్యలు చేపట్టినట్లు జిల్లా అటవీశాఖ అధికారి డీఏ కిరణ్ తెలిపారు. గురువారం పీఎం లంక, కేపీపాలెం సముద్ర తీరంలో తాబేళ్ల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చి విలేకరులతో మాట్లాడారు.


