News November 23, 2024
పవన్ ప్రభావం గురించి నేషనల్ మీడియా ప్రస్తావించట్లేదు: బొలిశెట్టి

మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి విజయంలో పవన్ కళ్యాణ్ ప్రభావం గురించి నేషనల్ మీడియా ప్రస్తావించడం లేదని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. దేశ రాజకీయాల్లో హిందువులపై విదేశీ హస్తం ఏమైనా ఉందా? అని Xలో అనుమానం వ్యక్తం చేశారు. ఆయన రోడ్షోలు, బహిరంగసభల గురించి చెప్పడంలో సోషల్ మీడియా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా ‘పవన్ గాలి కాదు తుఫాన్’ అని PM మోదీనే కొనియాడారని గుర్తు చేశారు.
Similar News
News November 12, 2025
విదేశీ ఉద్యోగుల అవసరం ఉంది: ట్రంప్

H-1B వీసా జారీలో తెచ్చిన సంస్కరణలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాటమార్చారు. తమ దేశంలో పారిశ్రామిక, సాంకేతిక రంగాలను అభివృద్ధి చేయాలంటే ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగుల అవసరముందని పేర్కొన్నారు. అనుకున్న స్థాయిలో నైపుణ్యం కలిగిన వాళ్లు అమెరికాలో లేరని అంగీకరించారు. జార్జియాలోని రక్షణ రంగానికి చెందిన పరిశ్రమ నుంచి కార్మికులను తొలగించడంతో ఉత్పత్తుల తయారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.
News November 12, 2025
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్లో ఉద్యోగాలు

ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<
News November 12, 2025
టమాటాలో శిలీంద్రం ఎండు తెగులును ఎలా నివారించాలి?

శిలీంద్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.


