News September 28, 2025

నేషనల్ న్యూస్ రౌండప్

image

* కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని డీటెయిల్డ్ రిపోర్ట్ కోరిన కేంద్రం
* ఢిల్లీలోని ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఇంట్లో దొంగతనం.. ఆమె ఓ మారథాన్‌లో పాల్గొనేందుకు మేఘాలయ వెళ్లిన సమయంలో ఘటన
* నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రాపై మనీలాండరింగ్ కేసులో ఈడీ ఛార్జ్ షీట్.. క్రిప్టో స్కామ్ సూత్రధారి అమిత్ భరద్వాజ్ నుంచి రూ.150 కోట్ల విలువైన 285 బిట్ కాయిన్లను అందుకున్నట్లు ఆరోపణలు

Similar News

News February 14, 2026

శివరాత్రి మరునాడు ఆప్షనల్ హాలిడే

image

AP: మహాశివరాత్రి పర్వదినం ఈ నెల 15(ఆదివారం) నాడు ఉంది. ఆ మరునాడు అంటే సోమవారం ప్రభుత్వం ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. ఈమేరకు సాధారణ పరిపాలనా శాఖ ఇవాళ జీవో విడుదల చేసింది. శివరాత్రి భక్తులు జాగారం చేయనున్నందున మరునాడు సెలవు తీసుకొనేలా ప్రభుత్వం ఈ అవకాశాన్ని కల్పించింది.

News February 14, 2026

గతేడాది మాదిరే ఉంది.. బడ్జెట్‌పై బుగ్గన విమర్శలు

image

AP: కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శలు గుప్పించారు. ‘బడ్జెట్ స్పీచ్‌లో అసత్యాలు చెప్పారు. సూపర్-6 అంటూ అధికారంలోకి వచ్చి వాటికి కేటాయింపులు లేవు. బడ్జెట్‌లో ఎలాంటి మార్పులు లేవు. గతేడాది బడ్జెట్ బుక్ చూసినట్లే ఉంది. ఊహాజనితమైన లెక్కలతో బడ్జెట్ రూపొందించారు. అసలు అప్పు ఎంత ఉందో చెప్పలేదు. ఏయే రంగాలకు ఎంత కేటాయించారో వెల్లడించలేదు’ అని వ్యాఖ్యానించారు.

News February 14, 2026

ఐఏఎస్ అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి

image

TG: ఫార్ములా-ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఏసీబీ ఆయనను విచారించనుంది. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ కార్ రేసు కోసం విదేశీ సంస్థకు అక్రమంగా డబ్బులు చెల్లించారని ఏసీబీ కేసు నమోదు చేసింది.