News November 18, 2024
రేపు రాష్ట్రానికి జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్
TG: రేపు రాష్ట్రంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ పర్యటించనుంది. మధ్యాహ్నం 12 గంటలకు వికారాబాద్‌లోని లగచర్లకు వెళ్లి రైతులు, గిరిజనులతో సమావేశం కానుంది. అనంతరం కలెక్టర్‌పై దాడి కేసులో సంగారెడ్డి జైలులో ఉన్న వారిని కలవనుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ చేరుకొని అక్కడే బస చేయనుంది.
Similar News
News November 18, 2024
వినూత్నం: చెక్కతో చేసిన ఉపగ్రహం
ప్రపంచంలో చెక్కతో తయారుచేసిన మొట్ట మొదటి ఉపగ్రహం ‘లిగ్నోశాట్’ను ఈనెల 5న అంతరిక్షంలోకి పంపారు. క్యోటో యూనివర్సిటీ & సుమిటోమో ఫారెస్ట్రీ పరిశోధకులు దీనిని అభివృద్ధి చేశారు. ఈ వినూత్న ఉపగ్రహం స్పేస్ఎక్స్ మిషన్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటుంది. భవిష్యత్తులో మూన్ & మార్స్‌పై అన్వేషణ కోసం కలపను పునరుత్పాదక పదార్థంగా ఉపయోగించవచ్చో లేదో పరీక్షించడం ఈ మిషన్ ఉద్ధేశ్యం.
News November 18, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News November 18, 2024
నవంబర్ 18: చరిత్రలో ఈరోజు
1901: సినీ దర్శకుడు, నిర్మాత వి.శాంతారాం జననం
1962: భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నీల్స్ బోర్ మరణం (ఫొటోలో)
1963: పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభం
1984: నటి నయనతార జననం
1994: కథా రచయిత పూసపాటి కృష్ణంరాజు మరణం