News August 18, 2024

ఏపీ కేంద్రంగా జాతీయ క్రీడలు నిర్వహిస్తాం: చిన్ని

image

AP: విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) తెలిపారు. ఇటీవల ఆంధ్రా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన ఆయనకు విజయవాడలో వాకర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం నిర్వహించి సన్మానించింది. ‘2027లో అమరావతి కేంద్రంగా జాతీయ క్రీడలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తాం. మంగళగిరిలోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని ఆరు నెలల్లో ప్రారంభిస్తాం’ అని చిన్ని వెల్లడించారు.

Similar News

News January 26, 2026

మనది చరిత్రాత్మక బంధం.. ఇండియన్స్‌కు ట్రంప్ రిపబ్లిక్ డే విషెస్

image

భారత 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మన దేశ ప్రజలు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య బంధం చరిత్రాత్మకమైనదని గుర్తుచేశారు. ఆయన మెసేజ్‌ను ఢిల్లీలోని US ఎంబసీ షేర్ చేసింది. టారిఫ్‌లు, ట్రేడ్ డీల్ విషయంలో ఇరు దేశాల మధ్య వివాదాలు కొనసాగుతున్నప్పటికీ.. ట్రంప్ నుంచి ఈ తరహా సందేశం రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News January 26, 2026

987 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్

image

కేంద్రీయ విద్యాలయాల్లో 987 స్పెషల్ ఎడ్యుకేటర్ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇందులో TGT 493, PRT 494 పోస్టులున్నాయి. 2026-27 విద్యాసంవత్సరానికి వీటిని భర్తీ చేయనున్నట్లు KVS వెల్లడించింది. జాబును బట్టి డిగ్రీ, డిప్లొమా(స్పెషల్ ఎడ్యుకేషన్), BEd(స్పెషల్ ఎడ్యుకేషన్), CTET ఉత్తీర్ణులు అర్హులు. వయసు 35 ఏళ్లలోపు ఉండాలి.
వెబ్‌సైట్: https://kvsangathan.nic.in/

News January 26, 2026

కొండెక్కిన వెండి ధర.. ఔన్స్‌కు $110!

image

అంతర్జాతీయ మార్కెట్లో సిల్వర్ ధరలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఇవాళ <<18959429>>ఉదయం<<>> ఔన్స్‌కు $100 వద్ద ఉన్న ధర ప్రస్తుతం $110కి చేరింది. కేవలం నెల రోజుల్లోనే 54% పెరుగుదల నమోదు కాగా జనవరి 2025తో పోలిస్తే ఏకంగా 280% పెరిగిందని ట్రేడ్ నిపుణులు తెలిపారు. ఆర్థిక అనిశ్చితి, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో వెండి వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడమే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు.