News January 25, 2025
‘జాతీయ ఓటర్ల దినోత్సవం’.. మీరు ఎన్నిసార్లు ఓటేశారు?

భారతదేశ ఎన్నికల సంఘం(ECI) స్థాపనకు గుర్తుగా ‘జాతీయ ఓటర్ల దినోత్సవం’ జరుపుకుంటున్నాం. 1950 JAN 25న ECIను స్థాపించగా, 2011 నుంచి అదే రోజు వేడుక జరుగుతోంది. కొత్త ఓటర్లను ప్రోత్సహించడంతో పాటు ఓటుపై ప్రజల్లో అవగాహన కోసం ఏటా ఈ రోజు ECI అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే, JAN 1 వరకు 18ఏళ్లు నిండిన వారికి ఓటరుగా నమోదు చేసి 25న గుర్తింపు కార్డులు అందిస్తుంది. మీరు ఎన్నిసార్లు ఓటేశారో కామెంట్ చేయండి.
Similar News
News November 23, 2025
పాడి పశువులకు ఈ లక్షణాలతో ప్రాణాపాయం

పాలజ్వరం అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయవు. నెమరు వేయక, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి S ఆకారంలో మగతగా పడుకోవడం పాలజ్వరం ప్రధాన లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది. ఈ వ్యాధి నివారణ సూచనల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News November 23, 2025
నేడు భారత్ బంద్

మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నేడు మావోయిస్టు పార్టీ భారత్ బంద్కు పిలుపునిచ్చింది. అనారోగ్యంతో ఉన్న హిడ్మా చికిత్స కోసం విజయవాడకు వస్తే పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని మండిపడింది. బంద్ నేపథ్యంలో AOBలో పోలీసులు అప్రమత్తమయ్యారు. విశాఖ నుంచి సీలేరు మీదుగా భద్రాచలం వరకు నడిచే బస్సులను రద్దు చేశారు. ఆదివారం కావడంతో మైదాన ప్రాంతాల్లో బంద్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చు.
News November 23, 2025
భారీగా పెరుగుతున్న రెవెన్యూ లోటు

AP: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు భారీగా పెరుగుతోంది. 2025-26లో రూ.33,185 కోట్ల రెవెన్యూ లోటు ఉంటుందని ప్రభుత్వం బడ్జెట్లో అంచనా వేస్తే, OCT నాటికే రూ.47,805 కోట్లకు చేరినట్లు కాగ్ తన నివేదికలో వెల్లడించింది. రెవెన్యూ ఆదాయం రూ.2.17 లక్షల కోట్లుగా అంచనా వేస్తే రూ.91,638 కోట్లు వచ్చాయి. ప్రస్తుత FYలో రూ.79,927 కోట్ల అప్పులు చేయాల్సి ఉండగా, 7 నెలల్లోనే రూ.67,283 కోట్ల రుణాలు తీసుకుంది.


