News April 2, 2025
ప్రకృతి vs అభివృద్ధి.. మీరు ఎటువైపు?

HYD గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని అభివృద్ధి చేస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించడం వివాదాస్పదం అవుతోంది. వేలాది చెట్లతో నగరానికి ఆక్సిజన్ అందిస్తోన్న ప్రాంతాన్ని అర్బనైజేషన్ చేయడం ఎందుకని ప్రకృతి ప్రేమికులు, HCU స్టూడెంట్స్ ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి నేపథ్యంలో పర్యావరణానికి కొంతమేర నష్టం కలగక తప్పదని.. ఇప్పటి హైటెక్ సిటీ కూడా అలానే వచ్చిందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 3, 2025
సంచలనం.. 25000 టీచర్ల పోస్టులు రద్దు

పశ్చిమ బెంగాల్‌లో టీచర్ల నియామకాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 2016లో జరిగిన 25 వేల టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను 2024లో కలకత్తా హైకోర్టు రద్దు చేయగా.. ఆ తీర్పును SC సమర్థించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవంది. 3 నెలల్లో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ నియామకాల్లో అక్రమాలు జరిగాయని కొందరు కోర్టును ఆశ్రయించారు.
News April 3, 2025
కంచ భూముల వివాదం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

TG: హెచ్‌సీయూ కంచ భూముల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం విక్రయించాలన్న భూములను సందర్శించి మ.3.30 గంటలకు నివేదిక అందించాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. 30 ఏళ్లుగా భూమి వివాదంలో ఉందని, అటవీ భూమి అని ఆధారాలు లేవని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు చెట్లు నరకవద్దని సీఎస్‌ను SC ఆదేశించింది.
News April 3, 2025
నా వయసును నమ్మలేకపోతున్నాను: రష్మిక

ఈ నెల 5న 29వ పుట్టినరోజు చేసుకోనున్నట్లు హీరోయిన్ రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. 29 ఏళ్లనే విషయం తనకే నమ్మశక్యంగా లేదని పేర్కొన్నారు. ఇది తన బర్త్ డే మంత్ అని పేర్కొంటూ వయసు పెరిగే కొద్దీ పుట్టినరోజును జరుపుకునేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ బ్యూటీ కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆమె నటించిన ‘సికందర్’ ఇటీవల థియేటర్లలో విడుదలైంది.