News September 24, 2025
నవదుర్గలు – పఠించాల్సిన మంత్రాలు (2/2)

6. శ్రీ సరస్వతీ దేవి: ఓం ఐం సరస్వత్యై నమ:
7. దుర్గాదేవి: ఓం దుం దుర్గాయై నమ:
8. మహిషాసుర మర్దని: ఓం హ్రీం శ్రీం క్లీం మహిషాసుర మర్దిన్యై నమ:
9. శ్రీ రాజరాజేశ్వరీ దేవి: ఓం హ్రీం రాజ రాజేశ్వరీ మాత్రే నమ:
Similar News
News September 24, 2025
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం: ఈసీ

TG: స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ లేఖ రాసింది. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29న షెడ్యూల్ రిలీజ్ చేస్తామని పేర్కొంది. దీనికి అవసరమైన ఎలక్షన్ ప్లాన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. నెల వ్యవధిలో ఎన్నికలు ముగించేలా ఏర్పాట్లు చేశామని, ఇప్పటికే ఓటర్ల జాబితాను ప్రచురించినట్లు వెల్లడించింది. అటు ప్రభుత్వం BC రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో ఇవ్వనున్నట్లు సమాచారం.
News September 24, 2025
అమరావతి మునిగిపోయిందని పోస్టు చేసిన ఉద్యోగి సస్పెండ్

AP: అమరావతి మునిగిపోయిందంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టిన తిరుపతి GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ‘అమరావతిలో 3 రిజర్వాయర్లు ఎందుకు? అమరావతినే ఒక రిజర్వాయర్‌గా కడితే పోలా? ఒకే ఒక్క వర్షం అమరావతి జలమయం’ అని AUG 19న పోస్టు చేశారు. ప్రభుత్వ ఉద్యోగి పోస్టులు వ్యక్తిగతం కావని, ప్రజలను ప్రభావితం చేయడంతో పాటు సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించినట్లు అవుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
News September 24, 2025
మరుగున పడుతున్న సాంప్రదాయ ఆకుకూరల సాగు

ఒకప్పుడు ప్రాంతాలను బట్టి అనేక రకాల ఆకుకూరలను ఉపయోగించేవారు. ఉదాహరణకు రాయలసీమలో పప్పాకు, ఎర్రబద్దాకు, పొనగంటాకు, బచ్చలాకు, చెంచలాకు, అవిసాకు, మునగాకు, కాంచి ఆకు, అటుకు మామిడి ఆకు, చింతాకు, గురుగాకు మొదలైనవి ఆకుకూరలుగా ఉపయోగిస్తారు. వీటితో తయారుచేసిన వంటలు అధిక పోషకాలు కలిగి మంచి వాసన, రుచి ఉండేవి. తరాలు మారుతుండటం, ఆసక్తి తగ్గడంతో ఇలాంటి ఆకుకూరల్లో కొన్నింటి సాగు, వినియోగం తగ్గింది.