News April 17, 2024
రెండు స్థానాల్లో నవీన్ పట్నాయక్ పోటీ

బిజు జనతాదళ్ అధినేత, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మరోసారి రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న హింజీలీ స్థానంతో పాటు బలాంగీర్ జిల్లాలోని కాంటాబాంజీ నుంచి బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. 2019లోనూ ఆయన హింజీలీతో పాటు బిజేపూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా ఈ రాష్ట్రంలో 147 నియోజకవర్గాలకు గాను నాలుగు దశల్లో(మే 13, 20, 25, జూన్1 తేదీల్లో) ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News January 5, 2026
MECON లిమిటెడ్‌లో 44 పోస్టులు

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News January 5, 2026
స్కూళ్లలో ఆధార్ క్యాంపులు.. ఉచితంగా అప్‌డేట్

AP: రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీల్లో నేటి నుంచి ఈ నెల 9 వరకు గ్రామ, వార్డు సచివాలయ విభాగం స్పెషల్ ఆధార్ క్యాంపులు నిర్వహించనుంది. 5-15 ఏళ్ల విద్యార్థులకు బయోమెట్రిక్స్ ఉచితంగా అప్‌డేట్ చేస్తారు. కొత్త కార్డులు కూడా ఇక్కడే తీసుకోవచ్చు. గత సెప్టెంబర్ నుంచి ప్రతీ నెలా స్పెషల్ క్యాంపులను నిర్వహిస్తున్నారు. ఇంకా 16.51L మంది స్టూడెంట్స్ ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు.
News January 5, 2026
తెలుగు హీరోలను తాకిన బికినీ ట్రెండ్

SMలో గ్రోక్ AIతో మొదలైన <<18744158>>బికినీ ట్రెండ్<<>> భారతీయులను కంగారు పెట్టిన విషయం తెలిసిందే. నిండుగా దుస్తులున్న ఫొటోలనూ ఒక కమాండ్‌తో బికినీలోకి మార్చేస్తోంది. హీరోయిన్లు, ఇతర సెలబ్రిటీలు ఈ ట్రెండ్‌కు బాధితులయ్యారు. కేంద్రం సీరియస్ అయ్యి ఆ కంటెంట్ తొలగించాలని ఆదేశించినా ఫలితంలేకుండా పోయింది. ఇప్పుడు దీని ఎఫెక్ట్ తెలుగు స్టార్ హీరోలను తాకింది. ట్విటర్‌లో వారి ఫొటోలను కూడా కొందరు బికినీల్లోకి మారుస్తున్నారు.


