News October 12, 2024

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీకి నవనీత్ కౌర్ దూరం!

image

బీజేపీ నేత నవనీత్ కౌర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోదని భావిస్తున్నట్లు ఆమె భర్త రవి రాణా తెలిపారు. బీజేపీ అధిష్ఠానం ఆమెకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కాగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో అమరావతి నుంచి పోటీ చేసిన నవనీత్ కౌర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. మరోవైపు వచ్చే నెల 26తో మహా అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది.

Similar News

News January 28, 2026

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

* అర్జున అవార్డు గ్రహీత, అథ్లెట్ జ్యోతికి విశాఖలో 500 చ.గజాల స్థలం, డిగ్రీ తర్వాత గ్రూప్-1 జాబ్
* ఏపీ టిడ్కోకు హడ్కో నుంచి రూ.4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ
* అమరావతిలో వీధిపోటు స్థలాలు పొందిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లు.. అమరావతి పరిధిలో అనాథలకు, భూమి లేని పేదలకు పెన్షన్లు
* అల్లూరి జిల్లా నందకోటలో పర్యాటక శాఖ ఫైవ్‌స్టార్ రిసార్ట్ ఏర్పాటుకు భూ కేటాయింపు

News January 28, 2026

ఏపీ జంగిల్ రాజ్‌గా మారింది: వైఎస్ జగన్

image

AP: రాష్ట్రం జంగిల్ రాజ్‌గా మారిందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘ప్రభుత్వ ఉద్యోగిని రైల్వే కోడూరు MLA వేధించారు. MLAలు రవికుమార్, ఆదిమూలం అలాగే ప్రవర్తించారు. కూటమి నేతలు దగ్గరుండి బెల్టు షాపులు నడిపిస్తున్నారు. సంక్రాంతి కోడిపందేలకు వేలం పెట్టారు. GOVT దగ్గరుండి అన్నీ చేయిస్తోంది’ అని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు స్కీమ్‌లను నిర్వీర్యం చేశారని WG నేతలతో భేటీలో మండిపడ్డారు.

News January 28, 2026

భారీ ధరకు ‘స్పిరిట్’ OTT హక్కులు?

image

డార్లింగ్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో వస్తోన్న ‘స్పిరిట్’ సినిమాకు భారీ డిమాండ్ నెలకొంది. చిత్రీకరణ పూర్తవకముందే దీని OTT హక్కులను ‘నెట్‌ఫ్లిక్స్’ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. హీరో, డైరెక్టర్ల రెమ్యునరేషన్ కాకుండా ఈ సినిమా బడ్జెట్ కంటే ఎక్కువ ధరకు OTT రైట్స్ విక్రయించినట్లు వెల్లడించాయి. కాగా ఈ చిత్ర సెకండ్ షెడ్యూల్ ఫిబ్రవరి 15 నుంచి తిరిగి ప్రారంభంకానుందని తెలిపాయి.