News June 4, 2024
నవనీత్ కౌర్ రానా ఓటమి

మహారాష్ట్రలో అమరావతి సిట్టింగ్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి నవనీత్ కౌర్ రానా ఓడిపోయారు. ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థి బల్వంత్ వాంఖడే 19,731 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వాంఖడేకు 5,26,271 ఓట్లు, నవనీత్ రానాకు 5,06,540 ఓట్లు పోలయ్యాయి. నవనీత్ తెలుగులో పలు సినిమాలు చేశారు. మరోవైపు ముంబై నార్త్ స్థానం నుంచి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కాంగ్రెస్ అభ్యర్థి భూషణ్ పాటిల్పై 3.52 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు.
Similar News
News January 9, 2026
OTTలోకి కొత్త సినిమాలు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ ఈరోజు నుంచి Netflixలో 5 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు మురళీ మనోహర్ డైరెక్షన్లో నరేశ్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘గుర్రం పాపిరెడ్డి’ ఈ నెల 16న ZEE5లోకి రానుంది. మరోవైపు శోభితా ధూళిపాళ్ల నటించిన ‘చీకటిలో’ సినిమా ఈ నెల 23న నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కాబోతోంది. దీనికి శరత్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు.
News January 9, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 9, శుక్రవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.48 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.23 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.22 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.58 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.15 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 9, 2026
ఈడీ vs ఐప్యాక్: హైకోర్టుకు చేరిన వివాదం!

కోల్కతాలోని ఐప్యాక్ ఆఫీసులో ED చేసిన <<18797775>>రెయిడ్స్<<>>పై రోజంతా హైడ్రామా నడిచింది. మమత వర్సెస్ ఈడీ అన్నట్లు సాగిన ఈ వ్యవహారం చివరికి కలకత్తా హైకోర్టుకు చేరింది. ఈడీ, ఐప్యాక్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశాయి. బెంగాల్ కోల్ మైనింగ్ స్కామ్కు సంబంధించి తాము సోదాలు చేశామని, తమను మమత అడ్డుకున్నారని ఈడీ తమ పిటిషన్లో పేర్కొంది. ఈడీ రెయిడ్స్ను ఆపేలా ఆదేశించాలని ఐప్యాక్ అభ్యర్థించింది.


