News September 22, 2025

నవరాత్రులు: నేడు అమ్మవారిని ఎలా పూజించాలంటే?

image

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నేడు బాలాత్రిపురసుందరీ దేవిగా అమ్మవారు అలంకృతమై భక్తులకు దర్శనమివ్వనున్నారు. మొదటి రోజు అమ్మవారికి గులాబీ రంగు చీర, మందార పువ్వులు సమర్పించి, పరమాన్నం/రైస్ ఖీర్ నైవేద్యంగా పెడతారు. ఈరోజున లలితా త్రిశతి పారాయణం చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు భక్తుల కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుస్తుందని అంటున్నారు.

Similar News

News September 22, 2025

INDvsPAK.. మూడోసారి తలపడే అవకాశం?

image

ఆసియాకప్ 2025లో పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా ఫైనల్లో తలపడే ఛాన్స్ ఉంది. ఇదే జోరులో సూపర్-4లో మిగతా రెండు మ్యాచులు గెలిస్తే భారత్ ఫైనల్ చేరనుంది. మరోవైపు శ్రీలంక, బంగ్లాదేశ్ కన్నా పాక్ మెరుగైన ప్రదర్శన చేసి ఫైనల్ చేరితే ముచ్చటగా మూడో సారి తలపడే అవకాశముంది. అటు 2022 నుంచి బిగ్ ఈవెంట్లలో PAKపై భారత్‌ డామినేషన్ కొనసాగుతోంది. 2022 T20WC నుంచి నిన్నటి వరకు మొత్తం 7 మ్యాచుల్లో టీమ్ ఇండియా జయభేరి మోగించింది.

News September 22, 2025

అటుకుల బతుకమ్మ ఎలా జరపాలి?

image

బతుకమ్మ పండుగలో రెండో రోజును ‘అటుకుల బతుకమ్మ’ అని అంటారు. ఈ రోజున బతుకమ్మను గునుగు, తంగేడు, నందివర్ధనం, బంతి, చామంతి, గుమ్మడి, బీర పూలతో పేర్చి, వాటిపై గౌరీ దేవిని ప్రతిష్ఠించాలి. అటుకులు, బెల్లం, చప్పిడి పప్పులను నైవేద్యంగా సమర్పించి, వాటిని పిల్లలకు పంచిపెట్టాలి. ఈ నైవేద్యం పిల్లలకు ఇష్టం కాబట్టే ఈ రోజుకు ‘అటుకుల బతుకమ్మ’ అనే పేరు వచ్చిందని నమ్మకం. ఈరోజే దేవి నవరాత్రులు కూడా ప్రారంభమవుతాయి.

News September 22, 2025

జీఎస్టీ ఎఫెక్ట్.. రూ.85వేల వరకు తగ్గిన ధరలు

image

టీవీలపై జీఎస్టీ శ్లాబు మార్పుతో పలు కంపెనీలు రూ.85వేల వరకు ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. నేటి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. LG గరిష్ఠంగా టీవీల ధరలను రూ.85వేల వరకు తగ్గించినట్లు తెలిపింది. సోనీలో రూ.70వేల వరకు, పానాసోనిక్‌లోనూ మోడల్‌ను బట్టి రూ.7వేల వరకు తగ్గించినట్లు వెల్లడించాయి. టూవీలర్స్‌లో రూ.18వేలు, కార్ల ధరలను రూ.4.48 లక్షల వరకు తగ్గించినట్లు ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి.