News January 4, 2025
నేడు నేవీ విన్యాసాలు

AP: విశాఖ ఆర్కే బీచ్లో నేడు నేవీ సాహస విన్యాసాల(ఆపరేషన్ డెమో)ను ప్రదర్శించనుంది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహించి అదేరోజు సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈసారి(2024 DEC) ఒడిశాలో నేవీ డే నిర్వహించగా విశాఖ ప్రజల కోసం ఇవాళ సాయంత్రం ప్రదర్శన చేపట్టనున్నారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తోపాటు వారి కుటుంబసభ్యులు సైతం హాజరుకానున్నారు.
Similar News
News November 25, 2025
డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగ్ కుంగిన ఘటనపై విచారణకు ఆదేశం

వేములవాడ శివారులోని ఆర్టీసీ డిపో సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఫ్లోరింగు కుంగిన ఘటనపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని, నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ శంకర్ తెలిపారు.
News November 25, 2025
పోలీసుల రూల్స్ కేవలం హిందువులకేనా?: రాజాసింగ్

TG: అయ్యప్ప మాల వేసుకున్న హైదరాబాద్ కంచన్బాగ్ ఎస్సైకి ఉన్నతాధికారులు మెమో జారీ చేయడంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైరయ్యారు. పోలీసుల రూల్స్ కేవలం హిందువులకే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. ముస్లిం సోదరులకు ఫ్రీడమ్ ఇచ్చి హిందూ పోలీసులకు ఎందుకు ఇవ్వట్లేదని నిలదీశారు. రంజాన్ సమయంలో ఇలాంటి రూల్స్ ఎందుకు పెట్టరని మండిపడ్డారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని సూచించారు.
News November 25, 2025
వాస్తు శాస్త్రం ప్రకారం.. పడక గది ఏ దిశలో ఉంటే మంచిది?

ఇంటి విస్తీర్ణంతో సంబంధం లేకుండా పెద్దవారి ప్రధాన పడక గది నైరుతి దిశలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. పిల్లల గది వాయువ్య దిశలో ఉండటం మంచిదని చెబుతున్నారు. ‘ఈ దిశల అమరిక నిద్ర నాణ్యతను పెంచుతుంది. నిద్ర సుఖాన్ని మెరుగుపరుస్తుంది. నైరుతి స్థిరత్వాన్ని ఇవ్వగా, వాయువ్యం చైతన్యానికి మద్దతునిస్తుంది’ అని ఆయన వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


