News June 10, 2024
వికారాబాద్ అడవుల్లో నేవీ VLF ట్రాన్స్‌మిషన్ స్టేషన్
TG: వికారాబాద్(D) పూడూరు మండలం దామగుండం రక్షిత అటవీ ప్రాంతంలోని 2,901 ఎకరాల భూమిని ఇండియన్ నేవీ తమ అధీనంలోకి తీసుకుంది. ఇక్కడ వెరీ లో ఫ్రీక్వెన్సీ(VLF) కమ్యూనికేషన్ ట్రాన్స్‌మిషన్ స్టేషన్‌ను ఏర్పాటు చేయనుంది. తాజాగా ఈ ప్రాంతం చుట్టూ సరిహద్దులు ఏర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభం కాగా 2027 నాటికి స్టేషన్‌ను నిర్మించనుంది. మరోవైపు అటవీప్రాంతంలో నిర్మిస్తుండటాన్ని పలువురు స్థానికులు వ్యతిరేకిస్తున్నారు.
Similar News
News December 23, 2024
VIRAL: షమీ-సానియా పెళ్లి ఫొటోలు.. నిజమిదే
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ షమీ తన భార్యతో, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన భర్తతో కొన్నాళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలోనే షమీ, సానియా పెళ్లి చేసుకున్నారంటూ తాజాగా కొన్ని ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ ఏఐ రూపొందించిన ఫొటోలే. కొందరు కావాలనే షమీ, సానియా పక్కపక్కనే ఉన్నట్లుగా ఫొటోలను ఏఐతో డిజైన్ చేశారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు.
News December 23, 2024
SSA ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: హరీశ్
TG: కాంగ్రెస్ ప్రభుత్వం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు డిమాండ్ చేశారు. హనుమకొండలో దీక్ష చేస్తున్న SSA ఉద్యోగులను ఆయన కలిశారు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీని అబద్ధాల వేదికగా మార్చారని దుయ్యబట్టారు. తాము రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, రూ.7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు.
News December 23, 2024
థియేటర్లో పాప్‌కార్న్ తింటున్నారా..!
సినిమా హాల్లో ఇంటర్వెల్ అవ్వగానే పాప్‌కార్న్ తెచ్చుకొని తినడం చాలామందికి అలవాటు. మల్టీప్లెక్సుల్లో వీటిధర రూ.250-350 వరకూ ఉంటోంది. ఇప్పటికే అంత పెట్టలేక కస్టమర్లు లబోదిబో అంటున్నారు. తాజాగా GST మండలి వీటిపై పన్నును వర్గీకరించడంతో భారం మరింతకానుంది. లూజ్ పాప్‌కార్న్‌పై 5, ప్రీప్యాక్డ్‌పై 12, కారమెల్ వంటి షుగర్ కోటింగ్స్ వేస్తే 18% GST అమలవుతుంది. ఇకపై నాలుకకు తీపి తగలాలంటే జేబుకు చిల్లుపడాల్సిందే.