News October 19, 2024

వయనాడ్ బీజేపీ అభ్యర్థిగా నవ్య హరిదాస్

image

కేరళలోని వయనాడ్ లోక్‌సభ ఉపఎన్నికకు బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. నవ్య హరిదాస్ పేరును ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. ఈ స్థానానికి కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. వయనాడ్ ఎంపీ అభ్యర్థితో పాటు అస్సాం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఉపఎన్నికలకూ బీజేపీ తమ అభ్యర్థుల పేర్లను వెల్లడించింది.

Similar News

News October 20, 2024

కర్వా చౌత్.. రూ.22 వేల కోట్ల వ్యాపారం?

image

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రేపు కర్వా చౌత్ వేడుక జరుపుకోనున్నారు. గత ఏడాది ఈ పండుగకు రూ.15వేల కోట్ల మేర వ్యాపారం జరగగా, ఈసారి అది రూ.22 వేల కోట్లకు పెరగొచ్చని వ్యాపారులు అంచనా వేశారు. ఢిల్లీలోనే రూ.4వేల కోట్ల మేర వ్యాపారం జరగొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్రగాజులు, సంప్రదాయ దుస్తులు, పూజాసామగ్రి, లాకెట్లు, మెట్టెలు, ఆభరణాల వంటివాటికి డిమాండ్ నెలకొందని వివరించారు.

News October 20, 2024

తెలంగాణ పోలీసులు దేశానికే గర్వకారణం: సీఎం రేవంత్

image

తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరుగుతున్న తొలి పోలీస్ డ్యూటీ మీట్‌కు హాజరుకావడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడే ఖాకీ సైనికులు, పెట్టుబడుల సాధనకు భరోసా కల్పించే శాంతిభద్రతకు ప్రతినిధులు, దేశానికే గర్వకారణం తెలంగాణ పోలీసులు’ అంటూ ఓ ట్వీట్‌లో కొనియాడారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, ప్రజాపాలన అన్న హాష్ ట్యాగ్‌లను దానికి జోడించారు.

News October 19, 2024

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్: CM రేవంత్

image

TG: పోలీసుల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘ఇందుకోసం యంగ్ ఇండియా పోలీస్ స్కూలు నిర్మిస్తాం. వచ్చే ఏడాది 1-5 క్లాసులతో దీనిని ప్రారంభిస్తాం. ఒక్కో ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ డిగ్రీ వరకు విద్య అందిస్తాం’ అని HYDలో పోలీస్ డ్యూటీ మీట్ ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు.