News March 20, 2025
2026 మార్చి 31నాటికి ‘నక్సల్స్రహిత భారత్’: అమిత్ షా

వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకల్లా భారత్ మావోయిస్టురహిత దేశంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. ‘ఈరోజు ఛత్తీస్గఢ్లో 22మంది నక్సల్స్ని మన సైనికులు అంతం చేశారు. ఈ క్రమంలో ‘నక్సల్ రహిత భారత్’ దిశగా మరో విజయాన్ని సాధించారు. ప్రభుత్వం ఎన్ని అవకాశాలిచ్చినా లొంగిపోని నక్సలైట్లపై జాలి చూపే ప్రసక్తే లేదు. మా ప్రభుత్వం వారిపై అత్యంత కఠిన వైఖరిని అవలంబిస్తోంది’ అని పేర్కొన్నారు.
Similar News
News March 21, 2025
ALL TIME RECORD

TG: రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరింది. తొలి సారిగా నిన్న సాయంత్రం 17,162 మెగావాట్లకు చేరిందని అధికారులు తెలిపారు. మరోవైపు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూస్తామని ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు.
News March 21, 2025
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై స్పందించిన ఫిల్మ్ ఛాంబర్

బెట్టింగ్ యాప్స్ల వల్ల యువత బలి అవుతుంటే సెలబ్రిటీలు వాటికి ప్రచారం చేయటం తప్పని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తెలిపింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన నటులపై చర్యలు తీసుకునేలా MAA అసోసియేషన్కు లేఖ రాస్తామని పేర్కొంది. యువత చెడిపోయే వ్యవహారాలలో సినీ పరిశ్రమ ఎట్టి పరిస్థితుల్లో భాగం కాకుడదని అభిప్రాయపడింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నట్లు పలువురు సెలబ్రిటీలపై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
News March 21, 2025
నేడే ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదల

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు విడుదల కానున్నాయి. CPS, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద కలిపి రూ.6,200 కోట్లు విడుదల చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నా ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని CM అన్నారు. బకాయిల విడుదలపై ఏపీ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. మిగిలిన పెండింగ్ అంశాలపైనా సానుకూలంగా స్పందించాలని ప్రకటనలో కోరింది.