News January 21, 2025
నక్సలిజం చివరి దశలో ఉంది: అమిత్ షా

ఛత్తీస్గఢ్లో తాజా ఎన్కౌంటర్ జరిపిన భద్రతా బలగాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. నక్సల్ ఫ్రీ భారత్ నిర్మాణంలో బలగాలు మరో పెద్ద విజయం సాధించాయన్నారు. ‘నక్సలిజానికి ఇది మరో బలమైన ఎదురుదెబ్బ. ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులో ఇరు రాష్ట్రాల బలగాలు, CRPF జాయింట్ ఆపరేషన్లో 14 మంది నక్సల్స్ చనిపోయారు. దేశంలో నక్సలిజం ఊపిరులు చివరికి చేరాయి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 12, 2025
పందుల నుంచి పంటను కాపాడే ద్రావణం!

కొందరు రైతులు పందుల బారి నుంచి తమ పంటను రక్షించుకోవడానికి కుళ్లిన కోడిగుడ్లను నీటిలో కలిపి పంట చుట్టూ చల్లుతున్నారు. ఈ ద్రావణం నుంచి వచ్చే సల్ఫర్ వాసన పందులకు చాలా అసహ్యంగా అనిపించడంతో పాటు పంట సహజ వాసనను వాటికి రానివ్వదు. దీంతో పందులు ఆ ప్రాంతానికి రావడానికి ఇష్టపడవని నిపుణులు చెబుతున్నారు. అయితే వర్షం పడినా లేదా వారం తర్వాత వాసన తగ్గిపోతే ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ మళ్లీ చల్లాల్సి ఉంటుంది.
News December 12, 2025
BREAKING: మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత శివరాజ్ పాటిల్(91) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో మహారాష్ట్ర లాతూర్ జిల్లాలోని స్వగృహంలో ఉదయం 6.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. 1972లో రాజకీయాల్లోకి వచ్చిన శివరాజ్ 2సార్లు MLA, ఏడుసార్లు MPగా గెలిచారు. ఇందిర, రాజీవ్, మన్మోహన్ క్యాబినెట్లలో డిఫెన్స్, సైన్స్ &టెక్నాలజీ, హోంమంత్రిగా పనిచేశారు. 10వ లోక్సభ స్పీకర్, పంజాబ్ గవర్నర్గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
News December 12, 2025
డెలివరీ తర్వాత ఒంటరిగా ఉండే డిప్రెషన్ ముప్పు

డెలివరీ తర్వాత మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు సంభవిస్తాయి. శరీరంలో జరిగే మార్పుల వల్ల చాలా మంది మహిళలు డిప్రెషన్లోకి వెళ్లిపోతుంటారు. అయితే ఈ సమయంలో తల్లిదండ్రులు, భర్త, అత్తమామలతో కలిసి ఉండటం వల్ల డిప్రెషన్ ముప్పు తగ్గుతుందని ఫిన్లాండ్లోని హెల్సింకీ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి డెలివరీ తర్వాత కోలుకోవడానికి ఒక మహిళకు కుటుంబ మద్ధతు ముఖ్యమని చెబుతున్నారు.


